ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే తాను కాల్చే చుట్ట అందులో తగలబడి పోతోంది అని మరొకడు ఏడ్చినట్లు ఉంది గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ వితండవాదం. సోమవారం అంబర్ పేటలో నాలుగేళ్ల బాలుడిని వీధి కుక్కలు పిక్కుతిని చంపేసాయి. మరి కొన్ని గంటల వ్యవధిలోనే కొత్త పేటలోని మారుతీ నగర్ లో మరో బాలుడిని వీధి కుక్కలు రక్త సిక్తంగా కరిచాయి.
ఈ విషయం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ దగ్గరికి విలేకరులు తీసుకెళ్ళి ఆమె వివరణ కోరారు. నగరంలో ఉన్న దాదాపు తొమ్మిది లక్షల కుక్కులను పట్టు కుంటాము అని చెప్పాల్సిన ఆమె వితందవడంలోకి దిగారు. ‘పిల్లవాడిని కుక్కలు చంపేంత వరకు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు?’ అని ఎదురు ప్రశ్న వేశారు. ప్రతి విషయం జి హెచ్ ఎం సి ఎలా చూసుకుంటుంది? అని నిర్లక్ష్య సమాధానం చెప్పారు. పైగా తాను కుక్కల ప్రేమికురాలినని, తాను కుక్కలను పెంచుకుంటున్నట్లు, వీధి కుక్కల మీద చర్యలు ఎలా తీసుకుంటాను?’ అని ఎదురుదాడి చేసి షాకిచ్చారు.
గద్వాల్ విజయలక్ష్మీ ఓ విషయం మరిచారు. ఆమె అమెరికాలో చాలాకాలం ఉన్నారు కాబట్టి అక్కడి పద్దతులు ఇక్కడ చెప్పారు. అమెరికాలో అనాథలు ఉండరు. ఒక ఇంటికి మరో ఇంటికి చాలా దూరాలు ఉంటాయి. పలుకరించే దిక్కు ఉండదు. ఇంటిని కాపలా కాసేందుకు మానవమాత్రులు ఉండరు. కాబట్టి వాళ్ళు స్వార్థంతో కుక్కలను పెంచుకుంటారు. అది వాళ్ళ అవసరం. దానిలో మానవత్వం ఏమి ఉండరు.
కానీ దానిని మనవాళ్ళు ఓ మానవత్వంగా అపార్థం చేసుకుంటారు. కుక్కలను పెంచుకుని, ‘మేము వన్య ప్రాణుల ప్రేమికులము’ అని ఫోజులు కొడతారు. నిజంగా మీకు సాటి ప్రాణుల మీద అంత ప్రేమ ఉంటే ముందుగా మన దేశంలో ఉన్న సుమారు ఐదు కోట్ల అనాథల లోంచి కనీసం ఇద్దరినీ పెంచుకోండి అని జనం ఎద్దేవా చేస్తున్నారు. సాటి మనిషి ప్రేమించలేని మీరు కుక్కలను ప్రేమించడం అంటే ‘అమ్మకు సున్నం పెట్టి అత్తకు గారెలు పెట్టినట్లు’ అని నవ్వుకుంటున్నారు. నగరంలో దిక్కు మొక్కులేక తిరుగుతున్నా పది వేల అనాథల లోంచి కనీసం ఒక్కడిని పెంచుకుని మీ ‘వన్య ప్రాణుల ప్రేమికులమని చాటుకోండి’ అని హితవు చెపుతున్నారు.
మీరు సమయానికి మీ కుక్కలకు డాగ్ బిస్కెట్లు వేస్తారు, రోజు గుడ్డు, బ్రెడ్డు, మాంసం వేసి వాటి కడుపు నింపుతారు. అందుకే అవి మీ మూతులు నాకి, తోకలు ఊపుతాయి. ప్రతి నెల వాటికీ వేలాది రూపాయలు కర్చు చేస్తారు. అదే కర్చుని ఇద్దరు అనాథల మీద చేస్తే వాళ్లు ఏ డాక్టర్స్ గానో, ఇంజనియర్లుగానో మారి ఈ దేశానికి ఉపయోగపడతారు. కుక్కలకు ఏసీ లు, డైపర్లు, జంతు డాక్టర్స్ అవసరం లేదు. అవి అడవిలో కూడా హాయిగా పెరుగుతాయి. కానీ మనిషి పెరగలేడు.
ముందు మన దేశంలో ఉన్న సాటి మనుషుల గురించి అలోచేస్తే మంచిది. విధి కుక్కలకు అన్నం కూడా దొరకక పిల్లను, కోళ్ళను, మేకలను పీక్కు తింటున్నాయి. మీకు కుక్కల పట్ల ప్రేమ ఉంటే నగరంలో తిరుగున్న తొమ్మిది లక్షల విధి కుక్కలను ఒక షెడ్ లో వేసి తిండి పెట్టండి అని సలహా స్తున్నారు జనం.