ఏపీ రాజకీయాల లాగే తెలంగాణ రాజకీయాలు ఉద్రిక్తస్థాయిని చేరుకుంటున్నాయి. బాధ్యతయుతమైన పదవిలో కొనసాగుతున్న మంత్రి ఉద్రిక్తలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతగా రాజకీయాల్లోకి వచ్చిన మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ చంపడం.. చావడం వంటి వాయిలెన్స్ లాంగ్వేజ్ ను వాడుతున్నారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రాకుండా అడ్డుపడేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు శ్రీనివాస్ గౌడ్. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలను ముందుంచి బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. కేసులు పెట్టినా, వేధించిన భయపడేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో కేసీఆర్ సైన్యం ఉందని చావడానికైనా , చంపడానికైనా సిద్దంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పెద్దలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విరుచుకుపడుతాయని ప్రచారం జరుగుతోన్న సమయంలో శ్రీనివాస్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి తెలంగాణలో రాజకీయ ఉద్రిక్త పరిస్తితుల్లేవు. కాని శ్రీనివాస్ గౌడ్ మాత్రం ఏపీ తరహ రాజకీయాలను ఇక్కడ చొప్పించాలనుకున్నారో, కేసీఆర్ కరుణ సన్నగిల్లిందని ఆందోళనతో ఈ కామెంట్స్ చేశారో తెలియదు. కాని ఆయన కామెంట్స్ మాత్రం ఆసక్తికరంగా మారాయి. ఇక, కాంగ్రెస్ తో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే అవకాశం లేదని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఒంటిరిగానే పోటీ చేస్తుందని అన్నారు.
పోలవరం విషయంలో సీఎం కేసీఆర్ విశాల దృక్పథంతో పని చేస్తారన్న శ్రీనివాస్ గౌడ్.. ఆ విశాల ప్రయోజనం ఏంటో క్లారిటీ ఇవ్వలేదు.