యాంకర్ అంటే ఒకప్పుడు ఆకట్టుకునే విధంగా మాట్లాడితే సరిపోతుంది అనుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆకట్టుకునేలా మాట్లాడటంతోపాటు గ్లామర్ గా కనిపించాల్సి ఉంటుంది. ఇలాగైతేనే తెరపై కనిపించే అవకాశం తడుతుంది లేదంటే నో ఛాన్స్. కొత్తగా తెరపై సందడి చేస్తోన్న యాంకర్లంతా గ్లామర్ ను నమ్ముకొని క్రేజ్ ను పొందిన వారే.
బుల్లితెరపై సందడి చేస్తోన్న రష్మీ, అనసూయలు ఎలాగైతే గ్లామర్ డోస్ పెంచి క్రేజ్ ను పొందారో ఇప్పుడు అదే దారిలో వెళ్తుంది మరో యాంకర్ శ్రీముఖి. పటాస్ రియాలిటీ షో ద్వారా క్రేజ్ సంపాదించుకున్న శ్రీముఖి అంతకుముందు కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసింది. ప్రస్తుతం యాంకరింగ్ తోపాటు సినిమాల్లోనూ చేస్తోంది. కాని అవకాశాలు బాగా తగ్గినట్లుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే గ్లామర్ పాత్రలకు నేను రెడీ అంటూ హింట్ ఇచ్చేలా శ్రీముఖి రెచ్చిపోయింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆమె ఫోటోలు కుర్రకారుకు మత్తెక్కిస్తున్నాయి. ఎద అందాలను ఆరబోస్తూ స్టన్నింగ్ లుక్స్ తో ఆదరగొట్టింది.