శ్రీరెడ్డి గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. క్యాస్టింగ్ కౌచ్ గురించి ఫిలిం చాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసి సంచలనానికి తెరలేపి ఫేమస్ అయింది. తనను పలువురు హీరోలు, నిర్మాతలు , దర్శకులు సినిమా ఆవకాశాలు ఇస్తామని శారీరకంగా వాడుకున్నారని పేర్లతో సహా బయటపెట్టింది. కొన్ని ఆధారాలను కూడా బయటపెట్టింది.
చిత్ర పరిశ్రమకు నష్టం వాటిల్లెలా వ్యవహరించిందని శ్రీరెడ్డికి ఎవరూ టాలీవుడ్ లో అవకాశం ఇవ్వలేదు. దాంతో ఆమె తన మకాం హైదరాబాద్ నుంచి తమిళనాడుకు మార్చింది. యూట్యూబ్ చానెల్ క్రియేట్ చేసుకొని వీడియోలు చేస్తూ సంపాదిస్తోంది. చెన్నై వెళ్ళినా తన నోటి దూల మాత్రం మార్చుకోలేదు. అప్పడప్పుడు సోషల్ మీడియా వేదికగా సినీ తరాలను, రాజకీయ నాయకులపై దుమ్మెత్తిపోస్తూనే ఉంటుంది శ్రీరెడ్డి.
వైసీపీ మౌత్ పీస్ గా ఉండే శ్రీరెడ్డి జగన్ ను ఏమైనా అంటే అంతెత్తున లేస్తుంది. వైసీపీ అధికార ప్రతినిధిగా చెలరేగిపోతుంది. పవన్ నుంచి చంద్రబాబు , నారా లోకేష్ లను కూడా వదిలిపెట్టదు ఇక ఆ పార్టీ నేతలను వదులుతుందా అందర్నీ దులిపెస్తుంది శ్రీరెడ్డి. గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన మహాసేన రాజేష్ తాజాగా మళ్ళీ టీడీపీలో చేరాడు. దీనిపై ఆమె స్పందించింది.
వైసీపీ ప్రత్యర్ధులు అంటే శ్రీరెడ్డికి కూడా ప్రత్యర్దులే. కాని మహాసేన రాజేష్ కు మాత్రం ఎందుకో మినహాయింపు ఇచ్చింది. అతని గురించి పాజిటివ్ గా మాట్లాడింది. తనను ఇంటికి రమ్మని ఆహ్వానించింది. మహాసేన రాజేష్ తన గురించి పాజిటివ్ గా మాట్లాడటం నచ్చిందని శ్రీరెడ్డి చెప్పడం విశేషం. అతని విమర్శించాలనుకున్న నా నోటిని కట్టిపడేశాడు. మా మధ్య పార్టీ పరంగా బేధాభిప్రాయాలు ఉండొచ్చు కాని తన గురించి పాజిటివ్ గా మాట్లాడటంతో ఫిదా అయ్యానని చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి.