పెళ్లి సందD శ్రీలీల మొదటి సినిమా. ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకుల మన్ననలు పొందింది. బాలీవుడ్ ఫీచర్స్ తో టాలీవుడ్ కు మంచి హీరోయిన్ దొరికిందని ఇండస్ట్రీ గుసగుసలాడుకుంది. ప్రస్తుతం రవితేజ సరసన ధమాకాలో శ్రీలీల నటిస్తోంది. తాజాగా ధమాకా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీలీల మాట్లాడిన మాటలు రవితేజ ఫ్యాన్స్ కు బాగా నచ్చాయి.
రవితేజకు నేను పెద్ద ఫ్యాన్ ను. చాలా అంకిత భావంతో పనిచేసే హీరో ఆయన. ఓ ఫైట్ సీన్ తెరకెక్కిస్తోన్న సమయంలో ఆయన కాలికి గాయమైంది. పన్నెండ్లు కుట్లు కూడా పడ్డాయి. కాని ఆ తరువాత రోజు ఆ గాయాన్ని కూడా పట్టించుకోకుండా షూట్ కు వచ్చారని మాస్ మహారాజ అంకిత భావాన్ని చెప్పుకొచ్చింది.
పన్నెండు కుట్లు కూడా పడి ఆయన పాట షూటింగ్ కు రావడం చూసి శ్రీలీల షాక్ అయినట్లు చెప్పింది. నేనో మెడికల్ విద్యార్ధిని. ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసు. కాని వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఆ పాట సీన్ లో పాల్గొన్నారు రవితేజ. థియేటర్ లో ఆపాటను చూస్తుంటే ఆయన కాలికి గాయమైనట్లు ఎవరికి అర్ధం కాదు. ఆయన కాలి గాయమైనట్లు ఎవరికైనా అనిపిస్తే నా పేరు మార్చుకుంటానంటూ శ్రీలీల చాలెంజ్ చేసింది.