యాంకర్ శ్రీముఖి త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ కు చెందిన బడా వ్యాపారవేత్తతో శ్రీముఖి ఎఫైర్ నడిపిస్తోందని వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇరు కుటుంబ సభ్యులు కూడా వీరి ప్రేమకు అంగీకారం తెలిపారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసేయాలనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కోట్లకు పడగలెత్తిన బిగ్ షాట్ ఇంటికి శ్రీముఖి ఇల్లాలిగా వెళ్తున్నారట. ప్రస్తుతం శ్రీముఖి కెరీర్ పీక్స్ స్టేజ్ లో ఉంది. అరడజన్ షో లకు ఆమె యాంకర్ గా చేస్తోంది. ఇటీవల బీబీ జోడి పేరుతో స్టార్ మా లో డ్యాన్స్ రియాలిటీ షో కూడా శ్రీముఖినే యాంకర్. డాన్స్ ఐకాన్ పేరుతో ఆహాలో ఓ షో ప్రసారమైంది. సదరు షోకి కూడా శ్రీముఖి యాంకర్ అండ్ జడ్జిగా వ్యవహరించింది.
Also Read : శ్రీముఖి పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అతనా..?
ఈ షో లలో మరీ రెచ్చిపోయి శ్రీముఖి స్కిన్ షో చేస్తోంది. పోట్టిపోట్టి నిక్కర్లు వేసుకొని యాంకర్ గా వ్యవహరిస్తుండటం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఏమాత్రం మొహమాటపడకుండా స్కిన్ షో చేసింది. గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గకపోవడంతో శ్రీముఖికి వరుసపెట్టి అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఇప్పుడు షోస్ పరంగానే ఆమెనే నంబర్ వన్. అంతేకాకుండా సిల్వర్ స్క్రీన్ పై మెరిసే ఆఫర్స్ కూడా వస్తున్నాయి.
అరడజన్ షోస్ చేస్తోన్న శ్రీముఖి నెలకు కోట్లలో సంపాదిస్తోంది శ్రీముఖి. ఇటీవల నూతన గృహప్రవేశం కూడా చేసింది. యాంకర్ గా రాణిస్తూనే నటిగా ఎదగాలని శ్రీముఖి ప్రయత్నాలు చేస్తుంది. క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు. అలాగే ‘ఇట్స్ టైం టు పార్టీ’ టైటిల్ తో విడుదలైన మూవీలో కూడా శ్రీముఖి ప్రధాన రోల్ చేశారు.
Also Read : ఎద అందాలను ఆరబోసిన శ్రీముఖి..ఒంటరిగా చూస్తే తట్టుకోలేరు..!