బుల్లితెర యాంకర్ గా గుర్తింపు సంపాదించుకుంది శ్రీముఖి. పటాస్ షోలో యాంకర్ గా చేసిన శ్రీముఖి అక్కడ రవితో కలిసి బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసింది. ఆ తరువాత ఈ అమ్మడుకు సినిమాలోనూ అవకాశాలు వచ్చాయి. సినీ ఆఫర్స్ రావడంతో నాజుకుగా తయారవ్వడంపై శ్రీముఖి ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఆమెకు మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి. తాజాగా శ్రీముఖికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శ్రీముఖి తన పెళ్లి గురించి అన్ని ఇంటర్వ్యూలో ఒకే సమాధానం చెప్పేది. తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్తూ వచ్చేది కానీ ఇటీవల ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు విషయాన్ని బయటపెట్టింది శ్రీముఖి. ఓ అబ్బాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించానని.. ఇద్దరం కలిసి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నామని చెప్పింది. కానీ అతను తనకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను, ఫోటోలను లీక్ చేయడంతో మనస్తాపానికి గురైనట్లు తెలిపింది. తనను అన్ని విధాలా వాడుకొని వదిలేశాడని సంచలన విషయాలను వెల్లడించింది.
తనే జీవితంగా బతికిన శ్రీముఖి తన ప్రియుడు చేసిన మోసంతో కొన్నాళ్ళు డిప్రెషన్ కి లోనైందట. ఒకానొక సమయంలో సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కెరీర్ దృష్ట్యా ఈ విషయాన్ని శ్రీముఖి తల్లిదండ్రులు బయటకు రానివ్వలేదని అంటున్నారు. అప్పటి నుంచి ప్రేమ , పెళ్లి అనే వాటిపై అసహనం వ్యక్తం చేస్తుందట శ్రీముఖి. శ్రీముఖిని వాడుకొని వదిలేసింది ఎవరన్నది నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అతను కూడా యాంకర్ అని కొంతమంది,మరికొందరు కొత్త సమాధానం చెబుతున్నారు.
ఇది ఎంతవరకు నిజమో కాని, ఈ వార్త మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.