కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. సోనియా గాంధీతో ఆమె కూతురు ప్రియాంక గాంధీ ఆసుపత్రికి వెళ్ళారు. అయితే ఆమె సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆసుపత్రీకి వెళ్ళారని పార్టీ నేతలు చెబుతున్నారు.
మరోవైపు, 76ఏళ్ల సోనియా గాంధీ శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారని పీటీఐ మీడియా సంస్థ వెల్లడించింది. మంగళవారం నుంచి ఆమె ఆరోగ్యం బాగోలేదని పేర్కొంది. సోనియా ఆరోగ్యం బాగోలేదని తెలిసి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు బ్రేక్ ఇచ్చి ఢిల్లీకి వచ్చారు.
మరోవైపు ఆమె త్వరగా కోలుకోవాలంటూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆకాంక్షించారు. ఆమె అనారోగ్యానికి గురికావడం బాధాకరమని చెప్పారు.