సైబర్ నేరాలు జరిగే ప్రమాదముందని పోలీసులు హెచ్చరిస్తున్నా కొంతమంది చెవిన పెట్టడం లేదు. సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడి బ్యాంక్ బ్యాలెన్స్ ను కోల్పోతున్న ఘటనలు వరుసగా వెలుగు చూస్తోన్న ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు.
పోలీసులు సదస్సులు ఏర్పాటు చేసి అవహగన కల్పిస్తున్నా, సోషల్ మీడియా ద్వారా చెబుతున్నా పట్టించుకోకుండా సైబర్ నేరగాళ్ళ చేతిలో బుక్కై లబోదిబోమంటున్నారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి సైబర్ నేరగాళ్ళ చేతిలోకి చిక్కి లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు.
ఆన్ లైన్ లో కాల్ గర్ల్ కోసం సెర్చ్ చేసి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి దాదాపు రెండు లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. చందానగర్ లో నివాసముండే ఓ ఐటీ ఉద్యోగి డిసెంబర్ చివరి వారంలో ఆన్ లైన్ లో కాల్ గర్ల్ కోసం వెతికాడు. ఈ క్రమంలోనే వెబ్ సైట్ లో లింక్ కనిపించింది. దాంతో ఆ లింకు క్లిక్ చేయగానే వాట్సాప్ నంబర్ దొరికింది. పటేల్ చార్మి పేరుతో పరిచయం చేసుకున్న వ్యక్తి వాట్సాప్ ద్వారా కాల్ గర్ల్స్ నెంబర్స్ తోపాటు అమ్మాయిల ఫొటోస్ పంపాడు.
బుకింగ్ కోసం 510, తర్వాత 5500, అనంతరం సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.7800, ఇలా వేర్వేరు కారణాలు చెబుతూ రూ.1.97 లక్షలు కాజేశాడు. చివరకు మోసపోయినట్టు తెలుసుకున్న బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు చేశాడు.