దేశంలోనే సంచలనంగా మారిన టి ఎస్ పి ఎస్ సి ఏ ఈ పరీక్షా పత్రాల లికేజి కేసు గురించి తెలిసిందే. అందరి జాతకాలు బయటపెడుతూ సిట్ ఉన్నత అధికారి, అడిషనల్ పోలీస్ కమిషనర్ ఏ ఆర్ శ్రీనివాస్ తుది నివేదికను సీల్డ్ కవర్లో పెట్టి నిన్న మంగళవారం హై కోర్టులో జడ్జికీ సమర్పించారు.
దాదాపు రెండు వారాలుగా లోతుగా దర్యాప్తు చేసిన ఆయన ఎవ్వరిని వదలలేదు అని తెలిసింది. తప్పు చేసినవాళ్ళను, ఆ తప్పు చేయించిన వాళ్ళను, దానికి సహకరించిన వాళ్ళను ఏ ఒక్కడిని కూడా ఆయన వదలలేదు అని తెలిసింది.
దీనితోపాటు ఆయన ఎవ్వరు ఉహించని కొత్త విషయాలు కూడా అందులో పొందుపరిచినట్లు కూడా సమాచారం అందింది. ఇందులో బడా నేతల జాతకాడా కూడా ఉన్నట్లు తెలిసింది. ఆ నేతలు ఎవరు అనే కొత్త ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఎవరికివారుగా భయంతో వణుకుతున్నారు. తేలు కుట్టిన దొంగల్లా అందరు ఒక్కసారిగా మౌనం వహించారు. త్వరలోనే ఆ నాయకుల బండారం బయటపడుతుంది.
ఇది ఇలా ఉండగా అడిషనల్ పోలీస్ కమిషనర్, సిట్ ఉన్నత అధికారి ఏ ఆర్ శ్రీనివాస్ కు బదులు ఈ కేసును సిబిఐకి అప్పగించాలని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బి. వెంకట్ నర్సింగ్ రావు, మరో ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్ ల మీద కూడా మంగళవారం వాదోపవాదాలు జరిగాయి.
సిట్ తరపున అడ్వొకేట్ జనరల్ బి ఎస్ ప్రసాద్ గట్టిగా వాదిస్తూ ఏ ఆర్ శ్రీనివాస్ నీతి, నిజాయితీ, లోగడ అతను చేసిన గొప్ప సేవలను కొనియాడారు. ఈ వాదనలు విన్న జస్టిక్ బి. విజయ్ సేన్ రెడ్డి అడ్వొకేట్ జనరల్ వాదనతో ఏకీభవించారు. కేసును ఎప్పటిలా కొనసాగించారు. సిబిఐకి అప్పగించాలని జడ్జి ఆదేశించలేదు.