చాలాకాలంగా మహారాష్ట్ర లోని ప్రముఖ షిర్డీ సాయిబాబా ఆలయం సెక్యూరిటీ వివాదం కేసు కోర్టులో ఉంది. దీనికి కారణం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ ఆలయంలో సరైన భద్రత లేదనే ఆరోపణలు అనేకం ఉన్నాయి. దేశ, విదేశాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. దేశంలో తిరుపతి తరువాత అత్యదిక భక్తుల ఆదరణ పొందిన గొప్ప ఆలయం ఇదే.
అయితే ఈ ఆలయానికి భద్రతా సమస్యలు చాలా ఉన్నాయని లోగడ భక్తులు మీడియా ద్వారా బాహాటంగానే వెల్లడించారు. దీనికి కారణం కొందరు తీవ్రవాదులు ఈ గుడిలో అలజడులు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని లోగడ ఇంటలి జెన్స్ విభాగం హెచ్చరించింది.
దీంతో కొందరు సీఐఎస్ఎఫ్ భద్రతా కల్పించాలని భక్తులు డిమాండ్ చేశారు. ఆలయననికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, వి వి పిలు విరివిగా వస్తుంటారు. దేశంలోని సంపన్నులు కూడా వస్తుంటారు. అయితే ఈ షిర్డీ ఆలయానికి భద్రతా ఏర్పాట్లను సాయి సంస్థాన్ ఎప్పటినుంచో నిర్వహిస్తోంది. ఆలయ ప్రాంగణ భద్రతను మాత్రం మహారాష్ట్ర పోలీసులు చూసుకుంటారు.
ప్రతి రోజూ బాంబు స్వ్కాడ్ తో తనిఖీ చేస్తూ రక్షణ కల్పిస్తారు. ఈ భద్రతా సరిపోవడం లేదని చాలా మంది భక్తులు చెబుతున్నారు. ఏదైనా జరగరాని అవాంతరం జరిగితే ఆలయం ప్రతిష్ట దెబ్బతింటుంది అని అభక్తుల ఆరాటం.
అందుకే 2018 లో సామాజిక కార్యకర్త సంజయ్ కాలే ముంబాయి హైకోర్టు లోని ఔరంగాబాద్ బెంచ్ లో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన బెంచ్, సీఐఎస్ఎఫ్ భద్రతపై ‘సాయి సంస్థాన్’ నుంచి అభిప్రాయాన్ని కోరింది. బెంచ్ నిర్ణయానికి సంస్థాన్ మద్దతు తెలిపింది.
అయితే ఇక్కడి గ్రామస్థులు, స్థానిక వ్యాపారులు మాత్రం కోర్టు వివరణను వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళు కూడా కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఖర్చుల కోసం రెండు రోజులపాటు బిక్షాటన చేశారు.
అందుకే ఈ వివాదం కారణంగా గ్రామస్థులు వ్యాపారులు మే 1 నుంచి నిరవధిక బంద్ పాటించనున్నారు. తమ నిరసన తెలపాలని నిర్ణయించారు. ఇక్కడున్న వ్యాపారాలు, ఇతర కార్యక్రమాలు మొత్తం నిలిపివేయనున్నారు.
అయితే దీనికి సంస్థాన్ కూడా మద్దతు పలకడం ఎవ్వరు ఉహించని కొసమెరుపు. షిర్డీ విషయంలో కోర్ట్, ప్రభుత్వం జోక్యం అనవసరం అన్నది వాళ్ళ భావన. తాజాగా ఈ రోజు జరిగిన అఖిలపక్షంతో సమావేశమయ్యి, మే 1 నుంచి బంద్ పాటించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇది ఎన్ని రోజ్లులు కొనసాగుతుందో మే ఒకటో తెడినా జరిగే సర్వ సభ్య సమావేశంలో నిర్ణయిస్తారు.
అయితే షిర్డీ సాయిబాబా ఆలయ సేవలకు మాత్రం ఎలాంటి ఆటంకాలు కానివ్వమని వీళ్ళు చెబుతున్నారు. ఆలయానికి సంబంధించిన అన్నీ సేవలు ఎప్పటిలాగే ఉంటాయన్నారు. అయితే వ్యాపార సంస్థలు మాత్రం మూసేస్తారు. అంటే హోటల్లు, టిఫిన్ సెంటర్లు, భోజనశాలలు, ప్రైవేటు వాహనాలు, ఆటోలు, టాక్సీ సేవలు లాంటివి మూసివేస్తారు. ఎవరి వాహనాలల్లో వాళ్ళే రావాలి, చెట్ల కిందో, బస్ స్టాండ్ లోనో వండుకుని నిదురపోవలసి వస్తుంది అని తెలిపారు. కాబట్టి ఈ సమ్మె ఓకొలిక్కి వచ్చేవరకు భక్తులు షిర్డీ కి వెళ్ళకపోవడమే మేలు.