అది శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి మండలం, కమ్మరవాండ్ల పల్లి. చాలా ప్రశాంతమైన ఊరు. ప్రేమానురాగాలకు పేరు మోసిన మంచి ఊరు. ఆ ఉరికి చెందిన బండ్లపల్లి తిమ్మరాజు సాఫ్ట్ వేర్ ఇంజనియర్. పెళ్లి చూపులకు పక్క ఊరికి వెళ్ళాడు.
ఆమె పేరు లక్ష్మీ. పెళ్లి చూపుల్లో అందరికి నచ్చింది. ఆమెకు తిమ్మరాజు కూడా నచ్చాడు. ఇష్ట పూర్వకంగా పెళ్ళికి ఒప్పుకుంది. ఆమె తల్లి దండ్రులు సంతోషించారు. ఘనంగా పెళ్లి చేశారు. అందరు సంతోషంగా ఉన్నారు. పెద్దలు కలిసి మూడో రోజే శోభనం చేశారు. ఆ రాత్రి ఇద్దరు స్వర్గం చవిచూశారు.
కుట్ చేసే ఉదయం ఆమె కనిపించలేదు. ఆమె బట్టలు, నగలు కనిపించలేదు. పుట్టింటికి వెళ్ళింది అనుకుని తిమ్మరాజు, అతని తమ్ముడు ప్రశాంత్ పరుగెత్తారు. తీరా చూస్తే ఆమె పుట్టింటికి కూడా వెళ్ళలేదు. పాదాల పసుపు పారాణి కూడా ఆరని నవదంపతుల మధ్య గొడవలు ఏముంటాయి? మరి ఆమె చెప్పాపెట్టకుడా ఎందుకు వెళ్ళుతుంది? ఎక్కడికి వెళ్ళుతుంది? అందరు కలిసి ఆమె గురించి వెతికారు. దొరకలేదు. పోలీసులకు పిర్యాదు చేశారు.
పోలీసులు తమ పద్దతిలో అరా తీశారు. పిడుగులాంటి వార్త తెలిసింది. లక్ష్మీ స్నేహితు రాలీని కలిశారు. పెళ్ళికి ముందే లక్ష్మీ ఓ కుర్రాడిని ప్రేమించింది అని తెలిసింది. అతనితో విచ్చల విడిగా తిరిగేది అని తెలిసింది. రెండు సార్లు అబార్షన్ చేయించుకుంది. అతనిని పెళ్లి చేసుకోవాలని ఆమె అనుకుంది.
కానీ ఆమె ఆ విషయం ఇంట్లో చెప్పలేదు. తనకు ఇద్దరు మగాళ్ళు కావాలి అని తరచు చెప్పడి అని తెలిసింది. ఇంట్లో తాళి కట్టిన మొగుడు ఉండాలి – బయట తనను ప్రేమించే మరో మొగుడు కూడా ఉండాలి అని చెప్పేది. అది జోక్ అనుకుని నవ్వి ఊరుకుంది అ స్నేహితురాలు. అయితే పెళ్లి కాగానే ఆమె మనసు పాత ప్రియుడి మీదకి మళ్ళింది. అందుకే అతని ఇంటికి వెళ్లి ఉండవచ్చు అని ఆ స్నేహితురాలు క్లూ ఇచ్చింది.
వెంటనే అందరు కలిసి లక్ష్మీ ప్రియుడి ఇంటికి పరుగెత్తారు. ఆ ప్రియుడు కూడా ఇంట్లో లేదు. పెళ్ళయిన ఓ అమ్మాయితో లేచిపోయాడు అని తెలిసింది. ఆ ఇద్దరినీ పట్టుకోడానికి పోలీసులు తమ స్టాయిలో పరిశోధన జరుపుతున్నారు.
ఇది మింగుడుపడని బండ్లపల్లి తిమ్మరాజు నలుగురిలో తల ఎత్తుకోలేకపోయాడు. పెళ్ళయిన మూడో రోజే భార్య ప్రియుడితో లేచిపోవడం ఏమిటని? అందరు ఎద్దేవ చేశారు. అతను మానసికంగా కృంగిపోయాడు.
అంతే! ఎవ్వరికీ చెప్పకుండా, చివరికి తమ్ముడికి కూడా చెప్పకుండా ఏటో వెళ్ళిపోయాడు. దాంతో ఆ తమ్ముడు లబోదిబో మంటూ పోలీసులకు పిర్యాదు ఇచ్చాడు. ఇప్పుడు పోలీసులు ఆ ముగ్గురికి కోసం గాలిస్తున్నారు. ఇదండీ మన నాగరికత.