స్త్రీ ఒంటికి బట్ట కట్టకపోయినా పర్వాలేదు, కానీ నోటికి మాత్రం బట్ట కట్టాలి అని పెద్దలంటారు. ఆ సూత్రం విజయానికి మొదటి సోఫానం. స్త్రీ కాలు జారినా పర్వాలేదు, కానీ నోరు జరకూడదు అని మన పెద్దలు తరచూ హెచ్చరిస్తారు. ఎందుకంటే ఓ తప్పటడుగు వేస్తే వెనక్కి తీసుకోవచ్చు. కానీ ఓ కారు కూత కూస్తే వెనక్కి తీసుకోలేదు. నోరు మంచిదైతే ఉరు మంచిదవుతుంది.
ఎక్కడో రాయలసీమలో పుట్టి, తెలంగాణాలో చదివి, మద్రాస్లో పెళ్లి చేసుకుని, ఆ భర్తను వదిలి, మళ్ళి హైదరాబాద్లో రెండో పెళ్లి చేసుకున్న షర్మిల ఫ్యాక్షన్ భావాజాలంతో నోరు పారేసుకుంటున్నారు. చిన్నా పెద్దా అనే తారతమ్యం లేదు. కులము, మతం అనే తేడా లేకుండా ఎవరినిపడితే వాళ్ళను నోటికి వచ్చినట్లుగా బండబూతులు తిడుతున్నారు. అది రాజకీయం అనిపించుకోదు. పాదయాత్ర పేరుతో గాలిపటంలా తిరుగుతూ ‘గాలిమాటలు’ మాట్లాడితే ఎవ్వరు సహించరు.
దీనికి అసలుకారణం ఆమె చేపట్టిన యాత్ర రేవంత్ రెడ్డి పాదయాత్రలా విజయవంతం కావడం లేదు. ఆమె రాజకీయ సిద్ధాతలు ఏమిటో ఆమెకే తెలియవు. ఏం మాట్లాడాలో అర్థంకాక కెసిఆర్ లాంటి సీనియర్ నాయకులను తిడుతున్నారు.
అలా బూతులు తిడితే పుబ్లిసిటీ వస్తుంది అని ఆమె ఆరాటం. ఆమెకు పుబ్లిసిటీ తపన మినహా ప్రజా సేవ మీద ద్యాసలేదని రాజకీయపండితులు మండిపడుతున్నారు. అసలు ఆమె గురించి ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఏ ప్రెస్ కూడా వార్తలు రాయడం లేదు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రచారం చేయడం లేదు. అదే ఆమె బాధ. ఆమె గురించి కెసిఆర్, కెటిఆర్, రేవంత్ రెడ్డి, బండి లాంటి వాళ్ళు తిట్టాలని ఆమె ఆరాటం. దానితో ప్రజలల్లో సింపతి పొందవచ్చు అని తపన. కానీ వాళ్ళు ఆమె గురించి అస్సలు పట్టించుకోవలేదు. అదే ఆమె బాధ.
ఆమెకు తండ్రి సమానమైన ఓ ఉద్యమ నేత, రాష్ట్ర ముక్యమంత్రి కెసిఆర్ ని పట్టుకుని ”నీకు సిగ్గుందా?” అని నోరు పారేసుకున్నారు. రేవంత్ రెడ్డిని దూషించారు. ఓ దళిత నాయకుడిని పట్టుకుని ”నువ్వు మగాడివి కాదు. హిజ్రావు” అని బూతులు తిట్టారు. హిజ్రాలు ఆగ్రహించి రోడ్డెక్కి ఆమెను బండ బూతులు తిట్టి, తమ జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ”ఆ దళిత నాయకుడు హిజ్రా అని నీకు ఎలా తెలిసింది? అతనితో నీకున్న సంబంధం ఎలాంటిది?” అని ఓ హిజ్రా పబ్లిక్ గా షర్మిలను నిలదీశాడు. ఆమె దానికి జవాబు చెప్పలేదు.
రాజకీయాలను ఎలా ఎదుర్కోవాలో సొంత అన్న జగన్ మోహన్ రెడ్డి ని చూసి ఆమె ముందుగా నేర్చుకోవాలి. జగన్ ప్రతిపక్షాలను ఎద్దేవా చేస్తారు. కానీ తిట్టరు. బూతులు వాడరు. అవసరంమయితే నాని లాంటి వాళ్లతో బండ బూతులు తిట్టిస్తారు. అదే రాజకీయం. ఆయన మాత్రం ప్రతిపక్షాలను సిద్ధాంత పరంగా ఇరికిస్తారు. ప్రతిపక్షాల తప్పులను ప్రజల్లోకి సూటిగా తీసుకెళ్లతారు. ప్రజలు ఆలోచించేలా చేస్తారు. ప్రజలను తన వైపు తిప్పుకుంటారు.
షర్మిల మాట్లాడితే రాజన్న పరిపాలన తీసుకుని వస్తానంటారు. దానికి ముందు రాజన్నలా బూతులు లేకుండా మాట్లాడే పద్దతిని అలవాటు చేసుకుంటే మంచిది అని జనం ఎద్దేవ చేస్తున్నారు. రాజన్న పద్దతిని జగన్ అనుస రించాడు కాబట్టి ఏపీకి నేడు సిఎం కాగలిగారు.
రాయకియల్లోకి కొత్తగా వచ్చిన కొత్తలో జయలలిత కూడా ఇలాగే నాటి తమిళనాడు ముఖ్య మంత్రి కరుణానిదిని ఇలాగే బూతులు తిట్టేవారు. ఓపిక నశించిన అయన అనుచరులు ఆమెను అసంబ్లీ లో ఎంతగా అవమాన పరిచారో తెలిసిందే. సైన్స్ మనలను భవిష్యత్ చూపుతుంది. కానీ చరిత్ర గతాని చూసి బాగుపడమని హెచ్చరిస్తుంది. ఆ చరిత్రను చదివి మనం బుద్దిగా మసులుకోవాలి అని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆమెను హెచ్చరిస్తున్నారు.
౦౦౦