కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ తో వైఎస్ షర్మిల నెల రోజుల వ్యవధిలోనే రెండుసార్లు భేటీ కావడం హాట్ టాపిక్ అయింది. తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తులు, వైఎస్సార్ టీపీ విలీనం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న వేళ డీకేతో షర్మిల సమావేశమవ్వడం ఇంట్రెస్టింగ్ గా మారింది. పొత్తు ప్రతిపాదనలు, పార్టీ విలీనం అంశాలపైనే డీకేతో షర్మిల చర్చించారా..? మరేదైనా కారణమా..? అనేది తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో బిగ్ డిబేట్ గా మారింది.
వైఎస్ ఫ్యామిలీతో డీకే శివకుమార్ కు ముందు నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే ఆయనను మర్యాదపూర్వకంగా కలిసినట్లు షర్మిల చెబుతోంది. అయితే…బెంగళూర్ లో వైఎస్ కుటుంబానికి ఆస్తులు బాగానే ఉన్నాయి. మారిన పరిణామాలతో సోదరుడు జగన్ ఉమ్మడి ఆస్తుల్లో వాటా ఇవ్వకపోవడంతో గుర్రుగా ఉన్న షర్మిల… ఉమ్మడి ఆస్తుల్లో వాటా దక్కించుకోవడానికి కర్ణాటక డిప్యుటీ సీఎం శివ కుమార్ ను కలిసి మద్దతు కోరినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ తో పొత్తు, విలీనం అనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. అసలు తెలంగాణలో షర్మిల ఉనికిని గుర్తించాడనికి కూడా రేవంత్ నిరాకరిస్తున్నారు. అలాంటిది రేవంత్ కు అత్యంత సన్నిహితుడు అయిన డీకే, రేవంత్ అభిప్రాయానికి విరుద్దంగా షర్మిలతో పొత్తు, విలీనం చర్చలు జరిపే అవకాశం లేదనేది స్పష్టం. ఒకవేళ వైఎస్సార్ టీపీ విలీనం జరిగితే షర్మిలకు ఏపీ పీసీసీ అద్యక్ష బాధ్యతలు అప్పగించే విషయంలో చర్చ జరుగుతూ ఉండొచ్చు కానీ తెలంగాణలో మాత్రం షర్మిల కాంగ్రెస్ తరుఫున ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయం చేసే అవకాశం తక్కువే.
వరుసగా రెండుసార్లు డీకేను షర్మిల కలుస్తున్నారంటే… ఖచ్చితంగా ఆస్తుల విషయమై చర్చించేందుకేనని అంటున్నారు. బీజేపీతో జగన్ ర్యాపో మెయింటేన్ చేస్తున్నారు దాంతో షర్మిలకు బీజేపీ నుంచి సహకారం అందటంలేదు. దీంతో బెంగళూర్ లోని ఉమ్మడి ఆస్తుల్లో వాటా కోసం డీకేను షర్మిల అప్రోచ్ అయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి.