గత వారం రోజులుగా సీఎం కేసీఆర్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని తాజాగా మంత్రి కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ వైరల్ ఫీవర్ పై సోషల్ మీడియాలో తనదైన శైలిలో పోస్ట్ చేశారు మాజీ ఎమ్మెల్యే , కాంగ్రెస్ నాయకురాలు సీతా దయాకర్ రెడ్డి.
కేసీఆర్ కు వచ్చింది వైరల్ ఫీవర్ కాదు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల ఫీవర్ అంటూ పోస్ట్ చేశారు. ఇందులో మంత్రి కేటీఆర్ యశోదా వైద్యులతో మాట్లాడుతున్న ఫోటోను ఉంచారు. యశోదా వైద్యులు కేటీఆర్ తో మాట్లాడుతూ.. కేసీఆర్ కు వచ్చింది వైరల్ ఫీవర్ కాదు అన్నట్టుగా ఫోటో డిజైన్ చేశారు. అనంతరం కేటీఆర్.. నాన్నకు వచ్చింది కాంగ్రెస్ గ్యారంటీల ఫీవర్ అనుకుంటా యశోదా వైద్యులతో అన్నట్లుగా పోస్ట్ డిజైన్ చేశారు. ఈ పోస్ట్ పెట్టిన క్షణాల్లోనే కాంగ్రెస్ సోషల్ మీడియా గ్రూప్లో హల్చల్ అవుతోంది. ఈ పోస్ట్ కాంగ్రెస్ శ్రేణులను బాగా ఆకర్షిస్తోంది.
ఈ పోస్ట్ వైరల్ కావడంతో పాలిట్రిక్స్ వెబ్ సైట్ సీతా దయాకర్ రెడ్డిని సంప్రదించగా… ఆమె స్పందించారు. సెప్టెంబర్ 17న తుక్కుగూడలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీ లను ప్రకటించిందని గుర్తు చేశారు. ఆ తరువాత మూడు రోజులకే కేసీఆర్ కు వైరల్ ఫీవర్ వచ్చిందంటే.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల వల్లే కావొచ్చునని ఎందుకు అనుకోకూడదని ప్రశ్నించారు. ఏదీ ఏమైనా.. సీతా దయాకర్ రెడ్డి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : బీజేపీపై రాములమ్మ సంచలన పోస్ట్ – కాంగ్రెస్ లో చేరికకు సంకేతాలేనా..?