హైదరాబాద్ ను మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్న ఏపీ ప్రభుత్వ పెద్దల వ్యాఖ్యల వెనక కేసీఆర్ ఉన్నారా..? ఆయన డైరక్షన్ లోనే జగన్ బాబాయ్, వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఈ కామెంట్స్ చేశారా..? రేవంత్ సర్కార్ ను ఇరకాటంలో పడేసేందుకు మరో మార్గం లేకపోవడంతో ఈ కామెంట్స్ తో సెంటిమెంట్ రెచ్చగొట్టవచ్చునని భావించారా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వెళ్ళడం అవమానంగా ఫీల్ అవుతున్నారు. రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలు బీఆర్ఎస్ కు ఊపిరి సలపనివ్వడం లేదు. కేసీఆర్ ఫ్యామిలీని సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందుకే తెలివిగా రాజకీయాలు చేసేందుకు కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. మళ్ళీ సెంటిమెంటే తనకు, పార్టీ ఉనికికి రక్షా అని నమ్ముతున్నారు. సెంటిమెంట్ తనకు అధికారాన్ని అప్పగించింది. సో, ఇప్పుడు అదే సెంటిమెంట్ తో రాజకీయం చేసేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు.
ఇప్పటికే కృష్ణా జలాలను కేంద్రానికి అప్పగించింది కాంగ్రెస్ ప్రభుత్వమని నల్గొండలో గర్జన చేశారు కేసీఆర్. కాని, అనుకున్న స్థాయిలో ఊపు రాలేదు. అందుకే ఆంధ్ర, తెలంగాణ అనే సెంటిమెంట్ ను రాజేసేందుకు కేసీఆర్ రెడీ అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏపీకి రాజధాని లేకపోవడంతో హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా మరికొన్నాళ్ళు కొనసాగించాలని వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్ వెనక కేసీఆర్ హస్తం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ వాదన వస్తే..కాంగ్రెస్ వచ్చాక తెలంగాణ సీమంధ్రుల చేతికి వెల్లబోతుందనే దిక్కుమాలిన వాదన తీసుకు రావొచ్చుననేది కేసీఆర్ ఆలోచన కావొచ్చు. ఈ అంశాన్ని ముందుంచి మళ్ళీ ఉద్యమ తరహలో పార్లమెంట్ ఎన్నికల ముంగిట రెచ్చగొట్టి.. ఎన్నికల్లో లబ్ది పొందాలనేది కేసీఆర్ వ్యూహం. తద్వారా లోక్ సభ ఎన్నికల్లో ముంచుకోస్తున్న ప్రమాదాన్ని తప్పించుకొని..పార్టీని బతికించుకోవచ్చుననేది ఆయన ప్లాన్ గా చెప్తున్నారు. ఇది కొట్టిపారేసేలా ఉన్నప్పటికీ..కేసీఆర్ ఏ అంశాన్ని వాడుకోగలిగే రాజకీయ అవకాశవాది అంటున్నారు ఆయనతో పని చేసిన నేతలు.