ఓ ఉపాధ్యాయుడు తన దగ్గర చదువుకునే ఎనిమిదో తరగతి విద్యార్థినికి ప్రేమ లేఖ రాశాడు. పదమూడేళ్ళ బాలికకు 47 ఏళ్ల ఉపాధ్యాయుడు తన చేతిరాతతో లవ్ లెటర్ రాసి వృత్తికి కళంకం తీసుకొచ్చాడు.
పదమూడేళ్ళ బాలికపై మనసు పడిన హరిఓమ్ సింగ్ అనే ఉపాధ్యాయుడు కొత్త సంవత్సరం సందర్భంగా విద్యార్ధినికి గ్రీటింగ్ కార్డు ఇచ్చాడు. దాన్ని ఇంటికెళ్ళి చదువుకోమని చెప్పాడు. దాంతో సార్ ఏం రాశాడోనని ఆతృతగా ఇంటికెళ్ళి గ్రీటింగ్ కార్డు ఓపెన్ చేసి చదివింది. అందులో నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంటూ రాసుకొచ్చాడు.
గ్రీటింగ్ కార్డు చదివిన విద్యార్థిని ఆ ఉపాధ్యాయుడి నీచపు బుద్దిని తల్లిదండ్రులకు వివరించింది. వెంటనే బాలిక కుటుంబ సభ్యులు పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు. ఈ విషయంపై విద్యాశాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అ ఉపాధ్యాయుడిని విధుల నుంచి సస్పెండ్ చేశారు.
ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బల్లార్పూర్ జిల్లా సదర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
Also Read : పదో తరగతి కూడా పూర్తి కాలేదు – అప్పుడే తల్లులు అవుతున్నారు..!