టార్గెట్ 14.. సీఎం రేవంత్ చెప్తున్న నెంబర్. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 సీట్లు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్లమెంట్ సీట్ ను రేవంత్ లైట్ తీసుకోవడం లేదు. అవసరమైతే హైదరాబాద్ స్థానంపై కూడా కాంగ్రెస్ జెండా పాతాలని పట్టుదలతో ఉన్నారు. తన వంద రోజుల పాలనకు పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండమని చెప్తుండటంతో.. లోక్ సభ సీట్లపై గట్టిగా డోకాస్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఒవైసీని ఓడించేందుకు బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ కాంగ్రెస్ ప్రారంభించింది. ఒవైసీని ఓడించాలంటే అంత ఆషామాషీ కాదు. అందుకే ముస్లిం వర్గానికి చెందిన ఓ సెలబ్రిటీని బరిలో దింపాలని కసరత్తు చేస్తోందని టాక్ నడుస్తోంది. టీమిండియా టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జాతో కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతోందని టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే టెన్నిస్ కు గుడ్ బై చెప్పిన సానియా మీర్జా నెక్స్ట్ ప్లాన్ పై చర్చ జరుగుతోంది. క్రీడారంగంలో విజయవంతమైన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పొలిటికల్ గ్రౌండ్ లోనూ సత్తా చాటాలని భావిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమె ఒకే అంటే హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలుపుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.