కాకినాడ రాజకీయాలు త్వరలోనే ఓ సంచలనానికి కేంద్ర బిందువు కానున్నాయి. అందుకు కారణం ప్రముఖ సామాజికవేత్త, సానా సతీష్ బాబు ఫౌండేషన్ వ్యవస్థాపకులు సానా సతీష్ బాబు రాజకీయ అరంగేట్రమేనని చెప్పడం అతిశయోక్తి కాదు. ప్రస్తుతం రాజకీయ వాతావరణ నేపథ్యంలో ఆయన కాకినాడ లోక్ సభ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం ఇప్పటికే జోరందుకుంది. సామాజికవేత్తగా ఆయన సేవలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో ఆయన సేవా కార్యక్రమాలు సానా సతీష్ బాబు రాజకీయ రంగ ప్రవేశాన్ని బలపరుస్తున్నాయి. కాకినాడవాసుల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఆయన పట్ల ప్రజల్లో ఆదరణను మరింత పెంచుతున్నాయి.
కాకినాడలో సకారాత్మక మార్పును తీసుకురావాలనే పట్టుదల, కాకినాడను అభివృద్ధి చేయాలనే అకుంఠిత దీక్ష సానా సతీష్ బాబును రాజకీయాల వైపు మళ్లేలా చేస్తున్నాయి. అందులోనూ జిల్లాలో ఆర్థిక, మౌలిక వసతుల అభివృద్ధిపరంగా కీలకమైన కాకినాడలో సానా సతీష్ బాబు రాజకీయ రంగ ప్రవేశం రానున్న ఎన్నికల్లో రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చనుంది. ఎందుకంటే సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను సానా సతీష్ బాబు నిర్వహించారు. కాకినాడ ప్రజల జీవితాలపై గుణాత్మక ప్రభావాన్ని చూపారు. క్షేత్ర స్థాయిలో ప్రజల సాధికారత, విద్య, ఆరోగ్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజల నుంచి అనూహ్య స్పందనను చూరగొన్నారు. అణగారిన వర్గాల జీవితాలపై సకారాత్మక ప్రభావాన్ని చూపి వారి జీవితాల్లో వెలుగులు నింపారు.
రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం కాకినాడలో సానా సతీష్ బాబు అభ్యర్థిత్వం క్రియాశీలక రాజకీయాలకు తెరలేపనుంది. అంతేకాకుండా ఆయన టీడీపీ, జనసేన పార్టీల్లోని ఏదైనా ఒక పార్టీ నుంచి పోటీ చేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అట్టడుగు స్థాయిలోని ప్రతిఒక్కరూ సాధికారత సాధించాలనే ఆయన సంకల్పం, సమాజాభివృద్ధిలో సతీష్ బాబుకు ఉన్న విస్తృతమైన అనుభవం, కాకినాడ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తాయనే విషయం స్పష్టమవుతోంది. సానా సతీష్ బాబు, ఆయన ఫౌండేషన్ నుంచి ఎటువంటి ప్రత్యక్ష నిర్ధారణ లేకపోయినప్పటికీ రాజకీయ వర్గాల్లో మాత్రం ఆయన శక్తివంతమైన అభ్యర్థిగా నిలుస్తారనే చర్చ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాకినాడ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందనే వాదనలకు జవసత్వాలను చేకూరుస్తుంది.
ఈ నేపథ్యంలో సామాజికవేత్త, అజాత శత్రువు సానా సతీష్ బాబు ప్రకటన కోసం కాకినాడ ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి ఆయన నిర్ణయం తీసుకుంటే నిస్సందేహంగా కాకినాడ ఎన్నికల్లో ప్రత్యేక కోణాన్ని ఆవిష్కరిస్తామంటున్నారు. ఆయన చేస్తున్న సమాజ సేవను ఆసక్తిగా చూస్తున్న కాకినాడ ప్రజలు, సతీష్ బాబు సామాజిక సేవను రాజకీయ కార్యాచరణలోకి మార్పు చేయాలని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త సానా సతీష్ బాబు రాజకీయ ప్రవేశం కాకినాడ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుందనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. వ్యాపారవేత్తగా, సామాజికవేత్తగా నేపథ్యం ఉన్న సానా సతీష్ బాబు ఓటర్ల దృష్టిలో మార్పును సాధించే దార్శనీకులుగా ప్రతిబింబిస్తారు. అందుకే కాకినాడ సానా సతీష్ బాబును రాజకీయ వేదికపై మానవత్వ విలువలతో కూడిన నాయకుడిగా చూసేందుకు ప్రేమాభిమానాలతో స్వాగతం పలుకుతోంది.