బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్. ఐదు పదుల వయసులోనూ పెళ్లి చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్నారు. ఇప్పటికీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ తో డేటింగ్ చేస్తున్నాడు.
బాలీవుడ్ మోస్ట్ క్రేజీ హీరో అయిన సల్మాన్ ఖాన్ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ తో అప్పట్లో ప్రేమాయణం కొనసాగించాడు. వీరు ప్రేమించి పెళ్లి చేసుకొవాలనుకున్నారు. కాని చివర్లో వీరి పెళ్లికి బ్రేక్ పడింది. అందుకు కారణం ఏంటంటే..ఓ వైపు ఐశ్వర్య రాయ్ తో ప్రేమాయణం కొనసాగిస్తూనే మరో వైపు ప్రీతీ జింటాతో కూడా సల్మాన్ ఖాన్ప్రేమాయణం నడపడమే. ఈ విషయం తెలిసి ఆఖర్లో ఐశ్వర్య రాయ్ పెళ్లికి నిరాకరించిందని అంటుంటారు.
పీకల్లోతు ప్రేమలో మునిగితేలినా ఐశ్వర్య రాయ్- సల్మాన్ ఖాన్ లు ఆ రోజుల్లో చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. వీరి రాసలీలలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. అంతేకాదు వీరి ఫోన్ కాల్ సంబాషణ అప్పట్లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది. విషయం బయటకు లీక్ కావడంతో ఐశ్వర్య రాయ్ ప్రియుడు సల్మాన్ ఖాన్ తో పెద్ద గొడవే పెట్టుకుంది. ఫోన్ కాల్ సంబాషణ తనే లీక్ చేశానని సల్మాన్ ఖాన్ అంగీకరించడంతో అతనితో ప్రేమాయణానికి ఐషూ ఎండ్ కార్డు వేసింది.
అప్పటి నుండి ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్ మరియు ఐశ్వర్య రాయ్ మాట్లాడుకోలేదు. ఇక ఆ తర్వాత ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ ని ప్రేమించి పెళ్లాడింది. సల్మాన్ ఖాన్ మరో ప్రేయసి ప్రీతి జింటా 2016, ఫిబ్రవరి 29న జీన్ గుడ్ఎనఫ్ ని పెళ్ళాడి , ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చింది.కానీ సల్మాన్ ఖాన్ మాత్రం ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు.
వీళిద్దరితో ప్రేమాయణం నడిపిన తర్వాత కత్రినా కైఫ్ తో చాలా కాలం వరకు డేటింగ్ చేసాడు..ఆ తర్వాత జాక్విలిన్ తో కొన్ని రోజులు డేటింగ్ చేసాడు..ప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Also Read : తారకరత్న భార్యకు ఇదివరకే పెళ్లి అయిందా..?