గత కొంతకాలంగా బాలీవుడ్ మూవీస్ లో ఏ సినిమా పెద్దగా ఆడింది లేదూ, పెద్దగా కలెక్షన్స్ వసూళ్లు చేసిందీ లేదు. సౌత్ సినిమాలతో పోలిస్తే అటు కంటెంట్ పరంగానూ, కలెక్షన్స్ పరంగా బాలీవుడ్ పూర్తిగా వెనకబడిపోయింది. కానీ ఇటీవల షారూఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో వచ్చిన పఠాన్ సినిమా కలెక్షన్స్ పరంగా దుమ్మురేపుతూ బాలీవుడ్ కు పూర్వ వైభవం తీసుకొచ్చింది.
షారుఖ్ ఖాన్, దీపిక పదుకునే హీరో, హీరోయిన్లుగా ప్రముఖ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి కాసుల కనకవర్షం కురిసింది. డే1నుంచి నేటి వరకు ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ 26 రోజులు పూర్తి చేసుకుంది.ఈ 26రోజులకు గాను అన్ని భాషల్లో వెయ్యి కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఈ సినిమా వివాదాస్పదం కావడంతో పఠాన్ కు ఫ్రీ ప్రమోషన్ కూడా లభించడం కలిసొచ్చింది.
వెయ్యి కోట్ల క్లబ్ లో ఇదివరకు కేవలం సౌత్ సినిమాలే ఉండేవి. బాహుబలి 2, కేజీఎఫ్ 2 , RRR వంటి సినిమాలు మాత్రమే ఈ మార్క్ ను అందుకున్నాయి. కాని పఠాన్ సినిమా మాత్రం ఈ మార్క్ ను దాటి కొత్త రికార్డ్ లను సృష్టించేలా ఉంది. RRRఅన్ని భాషల్లో కలిపి 1200కోట్లు వసూళ్లు చేసింది. పఠాన్ సినిమా ఆర్ఆర్ఆర్ వసూళ్ళను దాటుస్తుందా..? ప్రస్తుత ట్రెండ్స్ ను బట్టి చూస్తుంటే ఈ రికార్డ్ లను బద్దలుకొట్టే అవకాశం ఉన్నట్టే కనిపిస్తోంది.