మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కామందులు మారడం లేదు. బరితెగించి రెచ్చిపోతున్నారు. వయో బేధం లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లో 90ఏళ్ల వృద్దురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు కామాంధుడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే..మధ్యప్రదేశ్లోని షాహ్దోల్ జిల్లాకు చెందిన వృద్దురాలిపై అత్యాచారం జరిగింది. 90 ఏళ్ల వృద్ధురాలు తన బంధువులను కలిసేందుకు గురువారం రాత్రి జబల్ పూర్ వెళ్లింది. అక్కడ నుంచి షాదోల్ రైల్వే స్టేషన్కు వెళ్ళింది. చీకటి పడటంతో ఆమె రాత్రిపూట రైల్వే స్టేషన్ లో వుండిపోయింది. ఆపై ఆటో రిక్షా ద్వారా అంట్రా గ్రామంలోని మెయిన్ రోడ్డుకు చేరుకుంది.
ఆమె బంధువుల ఇంటికి చేరుకునేందుకు మరో వాహనం ఎక్కాలంటూ రిక్షా డ్రైవర్ వృద్ధురాలిని రోడ్డుపై వదిలి వెళ్ళిపోయాడు. బస్సు కోసం ఎదురుచూస్తుండగా..బైక్ పై అటుగా వెళ్ళిన ఓ వ్యక్తి చూపు ఆమెపై పడింది. ఇంకేముంది ఆమెకు మాయ మాటలు చెప్పి బైక్ ఎక్కించుకొని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళాడు. ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆపై ఆమెను ప్రధాన రహదారిపై వదిలి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు. బాధిత వృద్ధురాలు ఆసుపత్రిలో చేరిందని, నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read : ప్రియుడి మోజులో పడి భర్తను భార్య ఏం చేసిందంటే..?