బాలయ్య హోస్ట్ చేస్తోన్న అన్ స్టాపబుల్ షో పై ఏపీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ షోలో తాను పాల్గొనని స్పష్టం చేశారు. కూతరు కోసం , రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్టీఆర్ ని తప్పు చేసినట్లు చిత్రీకరించిన బాలకృష్ణ షో కు తాను వెళ్లబోనని తేల్చి చెప్పారు. అన్ స్టాపబుల్ లో పాల్గొనాలని గతంలోనే ఆహ్వానించారు. అప్పుడు అసెంబ్లీ సమయం. ఆ సమయంలో బాలయ్య షో లో పాల్గొంటే జనాల్లోకి తప్పుడు సందేశం వెళ్తుందని షో కు రాలేనని చెప్పినట్లు గుర్తు చేశారు రోజా.
అన్ స్టాపబుల్ లో చంద్రబాబు ఎపిసోడ్ చూసాక అస్సలు వెళ్లకూడదని డిసైడ్ అయ్యానని స్పష్టం చేశారు రోజా. సినీ ఇండస్ట్రీకి ఎన్టీఆర్ అంటే ఎనలేని గౌరవం ఉంటుందని.. అలాంటి వ్యక్తి మంచి జీవితం ఇచ్చి, ఆస్తులు పంచి ఇస్తే ఆయన్నే తప్పు చేసినట్లు నిరూపించాడు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తిని బాలయ్య వెనకేసుకు రావడం బాధాకరమని అన్నారు. అందుకే ఆ షో కు వెళ్లబోనని తేల్చి చెప్పారు.
బాలయ్యతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఇద్దరం కలిసి సినిమాలు కూడా చేశాం. అయినప్పటికీ ఆ షో కు వెళ్లనని స్పష్టం చేశారు రోజా. కూతురు కోసం, రాజకీయ అవకాశాల కోసం తండ్రికే అన్యాయం చేశాడు. చంద్రబాబు మంచి వాడు అని చెప్పేందుకు ఎన్టీఆర్ ను చెడ్డవాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని.. ఇది బాధాకరమని అన్నారు.
అన్ స్టాపబుల్ సీజన్ 2 లో బాలకృష్ణ టీడీపీ అధినేత చంద్రబాబును నాయుడిని గెస్ట్ గా పిలిచారు. ఈ ఎపిసోడ్ లో 1995 ఆగస్టు సంక్షోభం చర్చకు వచ్చింది. ఎన్టీఆర్ ని కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడానన్న నారా చంద్రబాబు నాయుడు.. నా నిర్ణయం తప్పా అని బాలయ్యను అడిగారు. అవును ఆ రోజు నాకు ఇంకా గుర్తు ఉందని బాలకృష్ణ సమాధానం చెప్పారు. దీని బేస్ చేసుకొని రోజా విమర్శలు గుప్పించింది.
Also Read : సరికొత్త రికార్డ్ నెలకొల్పిన ప్రభాస్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్