-రెపో రేటు పెంచిన ఆర్‌బీఐ
-సవరించిన రేట్లు ప్రకటన
భారత రిజర్వ్ భ్యాంక్-ఆర్‌బీఐ వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకురావడమే లక్ష్యంగా చర్యలు చేపట్టింది. ఇందుకు రెపోరేటును పెంచుతున్నట్టు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టంచేశారు. మూడు రోజుల చర్చల అనంతరం ద్రవ్య విధాన కమిటీ కీలక నిర్ణయాల్ని ప్రకటించారు. రెపో రేటును పెంచి 4.90 శాతానికి పెంచుతున్నట్టు తెలిపారు. రెపో రేటు అంటే.. ఆర్‌బీఐ వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇచ్చే రేటు అని అర్థం. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి రెపో రేటు ముఖ్యమైన సాధనంగా పరిగణిస్తారు. ద్రవ్యోల్బణం వల్ల ఇంధనంతో పాటు పలు వస్తువుల ధరలు పెరిగాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలను మరింతగా పెంచింది. పెంచిన రేట్లు తక్షణం అమల్లోకి వస్తాయని శక్తికాంత దాస్ తెలిపారు. అటు.. రేపోరేట్లు పెరగడంతో వాణిజ్య బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచనున్నాయి. ప్రస్తుత రెపో రేటుతో కారు, హోం, పర్సనల్ లోన్‌లపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి. పర్సనల్ లోన్ వడ్డీ రేటు 12శాతానికి, కార్ లోన్ 9.5శాతానికి పెరిగే అవకాశముంది.