రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. వైద్య సిబ్బంది సూచనలతో ఆయన పూర్తిగా ఫిట్ నెస్ సాధించేందుకు శ్రమిస్తున్నాడు. పంత్ ప్రమాద ఘటన జరిగిన సమయంలో అతను కోలుకోవడం కష్టమేనని.. జాతీయ జట్టుకు క్రికెట్ ఆడటం కుదరని పని చాలామంది చెప్పారు. కాని వైద్య సలహాలను అనుసరిస్తూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనే కసితో వేగంగా కోలుకుంటున్నాడు. త్వరలోనే మళ్ళీ టీమిండియాకు ఆడుతానని స్పష్టం చేస్తున్నాడు.
పంత్ కు జరిగినదీ చిన్న ప్రమాదమేమి కాదు. ప్రమాదం జరిగిన సమయంలో తనకు గాయాలైన సరే.. విండోస్ ను పగులగోట్టుకొని కారు నుంచి బయటకొచ్చి ప్రాణాలను కాపాడుకున్నాడు. ప్రమాద సమయంలో కారులో ఉండుంటే సజీవదహనం అయ్యేవాడు. అప్పట్లో ఇది సంచలనంగా మారింది. ప్రమాదం జరిగిన నాటి నుంచి పంత్ ది ఒకటే కల. మళ్ళీ టీమిండియా తరుఫున క్రికెట్ ఆడాలని. ఆ దిశగా శ్రమిస్తున్నాడు.
గాయాలు అయిన తరువాత పంత్ ఆలోచన విధానం మారింది. ప్రతి రోజు జట్టు కోసం ఆడాలనే ఉద్దేశం పెరుగుతోంది. అందుకే వైద్యుల సహకారంతో వేగంగా తన గాయాలను మాన్పుకుంటున్నాడు. పూర్తి ఫిట్ నెస్ సాధించి త్వరలో జట్టులోకి అడుగు పెడతానని బలంగా నమ్ముతున్నాడు. ఈ నేపథ్యంలో తన పళ్లు తానే తోముకోవడం ఉత్సాహాన్ని ఇస్తోందని చెబుతున్నాడు. క్రికెట్ కు దూరమైనందుకే బాధపడుతున్నాడు. త్వరలో జట్టులోకి వస్తేనే మజా ఉంటుందని చెబుతున్నాడు.
ఏ ఆటగాడికైనా క్రికెట్ కు దూరం కావడం వెలితిగానే ఉంటుంది. టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించే పంత్ జట్టుకు దూరం కావడంతో లోటుగానే చెప్పొచ్చు. తిరిగి క్రికెట్ జట్టులోకి రావాలని తహతహలాడుతున్నాడు. భారత జట్టుకు, ఢిల్లీకి మద్దతు కొనసాగించాలని అభిమానులను కోరుతున్నాడు.