టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ ఇటీవల నాగార్జున యూనివర్సిటిలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. విశ్వవిద్యాలయానికి వెళ్ళి విద్యార్థులకు నాలుగు మంచి మాటలు చెప్పకుండా సెక్స్ గురించి లెక్చర్ ఇస్తావా అంటూ రాజకీయ నాయకులు సైతం వర్మపై ఫైర్ అవుతున్నారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కూడా వర్మ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. వర్మ కామెంట్స్ ను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఆయన ఇలా అసభ్యంగా మాట్లాడినా సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరూ స్పందించకపోవడం మంచిది కాదని… వర్మను ఇలాగే వదిలేస్తే మహిళలను అవమానించడం ఆనవాయితీగా మారుతుందని తెలిపారు.
వర్మ నాగార్జున యూనివర్సిటీలో కాదు దమ్ముంటే ఉస్మానియా లేదా కాకతీయ యూనివర్సిటీకి వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చెయాలని ఛాలెంజ్ చేశారు. ఏపీలో మాట్లాడినట్లు తెలంగాణలో మాట్లాడితే విద్యార్థులు తిరగబడుతారని హెచ్చరించారు. వర్మను నాగార్జున యూనివర్సిటీకి ఆహ్వానించి పెంటపెట్టిన వర్సిటీ వైస్ ఛానల్సర్ ను సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని జగన్ కు లేఖ కూడా రాశారు వీహెచ్.
వీహెచ్ చేసిన వ్యాఖ్యలపై వర్మ సైతం తనదైన శైలిలో స్పందించారు. ట్విట్టర్ వేదికగా సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘తాత గారూ మీరింకా ఉన్నారా’ అంటూ ఎద్దేవా చేశారు వర్మ. మీ వల్లే కాంగ్రెస్ పార్టీకి ఆ గతి పట్టిందని సెటైర్లు వేశారు. వీహెచ్ మాట్లాడిన ఓ వీడియో లింక్ ను ప్రస్తావిస్తూ ‘నాసా యాక్ట్ వర్తించదు. టీఏడీఏ యాక్ట్ ని 1995లోనే తీసేశారు. ఇది కూడా తెలియని మీ లాంటి లీడర్స్ మూలానే కాంగ్రెస్ కు ఆ గతి’ అంటూ ట్వీట్ చేశారు.
ఓ తాతగారూ మీరింకా వున్నారా??? https://t.co/iLNuYnFqtw NASA యాక్ట్ వర్తించదు TADA యాక్ట్ ని 1995 లోనే తీసేశారు.. ఇది కూడా తెలియని మీ లాంటి లీడర్స్ మూలానే కాంగ్రెస్ కి ఆ గతి.. ఒక సారి డాక్టర్ కి చూపించుకొండి😘😘😘 pic.twitter.com/eQAOCkByrh
— Ram Gopal Varma (@RGVzoomin) March 19, 2023
వర్మ వ్యాఖ్యలపై వీహెచ్ మండిపడ్డారు. రాంగోపాల్ వర్మ తెలివి ఏంటో అర్థమవుతోందంటూ కౌంటర్ ఇచ్చారు. తాత ఉందో లేదో అనేది సమస్య కాదని.. ముందు నువ్వు మాట్లాడిన మాటల గురించి చెప్పంటూ ప్రశ్నించారు.
Also Read : వర్మకి డాక్టరేట్ ఇచ్చిన యూనివర్సిటీకి రిటర్న్ గిఫ్ట్ ఏం ఇచ్చాడో చదవండి