గత కొంతకాలంగా ముందస్తు ఎన్నికల చర్చ తెలుగు రాష్ట్రాలో జోరుగా జరుగుతోంది. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ క్లారిటీ ఇవ్వడంతో ముందస్తు వార్తలకు ముగింపు పడగా… ఏపీలో మాత్రం ఈ ముందస్తు ముచ్చట తాజాగా మరింత ఆసక్తి రేపుతోంది. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే డిసెంబర్ లో తెలంగాణతోపాటు ఏపీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్ తరుచుగా ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటం ముందస్తు ఎన్నికలపై కేంద్రం సహకారం కోరేందుకేనని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నానాటికీ వైసీపీ సర్కార్ పై ప్రజాగ్రహం ఎక్కువ అవుతుండటంతో జగన్ ముందస్తుకు మొగ్గు చూపుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. డిసెంబర్ లో తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరగోచ్చుననే అంచనాలు ఉన్నాయి. కానీ ఈ వార్తలను వైసీపీ ఖండించడకపోవడంతో ఏపీలో ముందస్తు ఖాయమనే ప్రచారానికి బలం చేకూరుతోంది.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ సోమవారం ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా, నియోజకవర్గ ఇన్చార్జిలతో సమావేశం కానున్నారు. ఈ భేటీ కూడా ఈ సన్నాహకాల్లో భాగమేనని అందుకే ఆయన హుటాహుటిన ఈ బేటిని నిర్వహిస్తున్నారని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమావేశంలోనే జగన్ ముందస్తు ఎన్నికలపై ఎమ్మెల్యేలకు ఓ క్లారిటీ ఇస్తారని చెబుతున్నారు.
ఏపీలో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వస్తోన్న వేళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని అమితంగా అభిమానించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా ట్విట్టర్లో ఆయన పెట్టిన పోస్ట్ చూస్తే ముందస్తు ఎన్నికల ఊహాగానాలు నిజమే అన్న భావన వ్యక్తం అవుతోంది. త్వరలో ఏపి అసెంబ్లీ రద్దు కాబోతుందని ఆయన ప్రకటించారు. వైసీపీ నుంచి తనకు అందిన సమాచారం మేరకు ఈ విషయాన్ని పంచుకున్నట్లు ట్వీట్ లో పేర్కొన్నారు. జూన్ మొదటి వారంలో ఏపీ అసెంబ్లీ రద్దు అవుతుందని తేల్చి చెప్పారు. డిసెంబర్ లో ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు.
Just heard from the top YSRCP sources that the assembly will be dissolved in June 1st week and election will be in December
— Ram Gopal Varma (@RGVzoomin) April 1, 2023