ఏపీకి మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు పార్టీ సభలు ఎక్కడ నిర్వహించాలో తెలియదా అంటూ ప్రశ్నించారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ప్రజల భద్రతపై ఏ మాత్రం అవగాహనా లేకుండా స్వార్ధం కోసం ఇరుకు ప్రదేశాలలో సభలను నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు వర్మ.
విశాలమైన ప్రాంతాల్లో సభ పెడితే, తక్కువ జనాలు వస్తే, తనకు పాపులారిటీ తగ్గిపోయిందనే విషయం ప్రజలకు తెలిసిపోతుందనే భయంతోనే చంద్రబాబు ఇరుకు సందుల్లో సభలు పెట్టి ప్రజల ప్రాణాలు తీశారని విమర్శించారు.
ప్రజలకు కానుకల కహనీలు చెప్పి సభకు వచ్చిన ఎంతో మంది ప్రాణాలను బలిగొన్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబును మీరు అనకుండా మొదటిసారి నువ్వు అని సంబోదిస్తున్నట్లు చెప్పారు వర్మ.
తన సభకు ఇంతమంది వచ్చి ప్రాణాలను కోల్పోయారని చంద్రబాబు ప్రచారం చేసుకుంటారంటూ ఫైర్ అయ్యారు వర్మ. ఆయన్ను హిట్లర్, ముస్సోలినితో పోల్చుతూ వీడియోను తన సోషల్ మీడియాలో విడుదల చేశారు. నర హంతకుడు నారా చంద్ర బాబు నాయుడు మీద ఆర్.జీ.వి కామెంట్ అనే టైటిల్ తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. వర్మ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.