రాష్ట్ర రాజకీయాల్లో చాణక్య నీతి తెలిసినవాడు కేసీఆర్ అని అంటారు. ఇందులో ఆయనకంటే రెండాకులు రేవంత్ రెడ్డి ఎక్కువే చదివినట్లున్నాడు. అందుకే ఎప్పుడు, ఎలా రాజకీయం చేయాలో చేసేస్తున్నారు రేవంత్. కేసీఆర్ ను గద్దె దించాలంటే రేవంత్ తోనే సాధ్యం అవుతుందని ప్రజల్లో విశ్వాసం ఏర్పడింది. కేసీఆర్ కు తగ్గ నాయకుడిగా రేవంత్ పేరును చెప్పుకొస్తున్నారు. ఇకపోతే.. రేవంత్ పాదయాత్ర చేస్తున్నారు. బుధవారంతో మూడో రోజుకు చేరింది. ములుగు నియోజకవర్గంలో సాగుతున్న ఈ పాదయాత్రకు జనం నుంచి భారీ ఆదరణే వస్తోంది. కాని అంతకుమించి కోరుకున్నట్టు ఉన్నారు రేవంత్. అందుకేనేమో ప్రగతి భవన్ ను పేల్చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అప్పట్లో దొరల గడీలను నక్సలైట్లు పేల్చేసేవారని..ఇప్పుడు ప్రగతి భవన్ ను పేల్చి వేసినా ఎవరికీ అభ్యంతరం లేదని రేవంత్ వ్యాఖ్యానించారు. పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వలేదు గానీ, హైదరాబాద్ లో మాత్రం 2 వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రగతి భవన్ కట్టుకున్నారని ధ్వజమెత్తారు.పేదలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ఎందుకని ప్రశ్నించారు. ఆనాడు గడీలను నక్సలైట్లు గ్రానైట్ లతో పెల్చేవారని.. ఇప్పుడు బాంబులతో ప్రగతి భవన్ పేల్చి వేయాలంటూ ఘాటుగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
ఎక్కడ గురి చూసి కొట్టాలో అక్కడే కొట్టేశారు రేవంత్ రెడ్డి. ఇంకేముంది ప్రగతి భవన్ పాలేర్లకు మండింది. రేవంత్ పై మండిపడుతున్నారు. డీజీపీకి ఫిర్యాదు చేస్తామని.. యాత్రను అడ్డుకుంటామని ప్రకటనలు ఇస్తున్నారు. తన యాత్రను అడ్డుకుంటే తొక్కుకుంటూ వెళ్తానని హెచ్చరిస్తున్నారు రేవంత్. ఇలా రేవంత్ సంచలన వ్యాఖ్యలతో యాత్రకు కావాల్సిన ప్రమోషన్ కంటే వచ్చేలా ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. రేవంత్ వ్యూహంలో చిక్కుకొనిపోయారు.
కేసీఆర్ నక్సలైట్ ఎజెండా ఇదేనా..?
కెసిఆర్ ఎన్నికల ప్రచారంలో మావోయిస్టులను ఏరివేస్తానని ప్రధాన ఎజెండా గా పెట్టుకున్నాడు. పదవి రాగానే పాతకాలం నైజం దొరల మారి ప్రజాస్వామాన్ని పక్కన పెట్టాడు. ఎంతోమంది మావోయిస్టులను ఫేక్ ఎన్కౌంటర్లు చేయించాడు. శృతి, సాగర్, వివేక్ లాంటి మావోయిస్టులు ఎలా చనిపోయారో జనానికి తెలియదా? మావోయిస్టుల శవాలు కూడా దొరకకుండా పాతిపెట్టిన చరిత్రను ఎంతకాలం పాతిపెడతారు? ఎంత లోతుగా పాతిపెట్టిన, ఎంతకాలం గడిచినా ఎముకలు ఉంటాయి.
పెన్నుల మీద మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయి. ఇంత చిన్న లాజిక్ మరచిన నాటి తెలుగుదేశం హోమ్ శాఖ మంత్రి ఎ. మాధవరెడ్డికి పట్టిన గతి ఏమిటో చరిత్ర మరిచిందా? దిక్కులేని చావు కోరి తెచ్చుకోలేదా? నాటి సీఎం చంద్ర బాబు నాయుడు కార్ మీద మీద జరిగిన అలిపిరి ఘటన ఎలా మరుస్తారు. చావు తప్పి కన్ను లొట్టపోయిన చంద్రబాబు నాయుడు నేర్చుకున్న గుణపాఠం ఏ పాఠశాలలో నేర్చుకోలేని పాఠం.
కలుపు మొక్కలను పీకేస్తున్నామని మావోయిస్టులను ఆగమాగం చేస్తే ఎలా ఊరుకుంటారు? ఎందుకు క్షమిస్తారు? వాళ్ళు ప్రతీకారం తీర్చుకోకుండా ఎలా వదిలేస్తారు. వాళ్ళు ప్రగతి భవన్ మీద దాడులు చేస్తే దానికి ఎవరు భాద్యులు? అటు నైతికంగా, ఇటు ధర్మ పరంగా కెసిఆర్ భాద్యుడు కాదా? నువ్వు చస్తావురా అని డాక్టర్ రోగికి చెపితే అది తప్పు ఎలా అవుతుంది? ప్రగతి భవన్ మీద మావోయిస్టుల దాడి చేస్తారు అని రేవంత్ చెప్పడం తప్పు ఎలా అవుతుంది? సజ్జనులు ఆలోచించాలి.