తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి వర్గం, యాంటీ రేవంత్ టీమ్ ఉండేది. పీసీసీ చీఫ్ గా రేవంత్ ఏ నిర్ణయాలు తీసుకోవాలనుకున్న యాంటీ టీమ్ మద్దతు కొరాల్సిన పరిస్థితి. ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా అప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలు వేగంగా తీసుకోవాలి. లేదంటే పార్టీ బలహీనపడుతుంది. అందులో భాగంగా సీనియర్లతో చర్చించకుండానే కొన్నిసార్లు రేవంత్ నిర్ణయాలు తీసుకున్నాడు.ఇది నచ్చని సీనియర్లు పార్టీ పరువు బజారుకీడ్చెలా విమర్శలు చేశారు. అధిష్టానం పలుమార్లు పిలిచి నచ్చజెప్పినా తీరు మార్చుకోకపోవడంతో వారిపై అధిష్టానం కూడా విసిగిపోయినట్టు ఉంది.
పని చేసే నేతలకే కత్తి అందివాలన్న యుద్దనీతికి కట్టుబడి రేవంత్ రెడ్డికి ఫుల్ పవర్స్ ఇచ్చింది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పీసీసీ జంబో టీమ్ లో రేవంత్ రెడ్డి వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. సీనియర్ల మాటలను నమ్మితే పార్టీ నాశనం అవుతుందని ఎట్టకేలకు గ్రహించి పీసీసీ కార్యవర్గం నుంచి డీసీసీ అధ్యక్షుల నియామకం వరకు రేవంత్ రెడ్డి టీమ్ కు ఫస్ట్ ప్రీయార్టీ ఇచ్చింది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ను నియమించినా, పీసీసీలో కొంతమంది సీనియర్ నేతలు పక్కలో బల్లెంలా తయారని వారికీ ఉద్వాసన పలికింది.
ఎన్నికలకు మరో ఏడాది సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో కూడా సీనియర్లు, జూనియర్లనీ ఆలోచిస్తూ కూర్చుంటే జరగాల్సిన నష్టం జరుగుతుందని రేవంత్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది. ఎన్నికల వరకు మరోసారి టీపీసీసీనీ ప్రక్షాళన చేసే ఛాన్స్ లేకుండా పక్కగా ఈ జంబో టీమ్ ను రెడీ చేసింది. దీంతో పీసీసీ కార్యక్రమాల విషయాలు లీక్ కాకుండా పక్కగా ప్లాన్ మేరకు జనాల్లోకి వెళ్లేందుకు రేవంత్ రెడ్డి రూట్ మ్యాప్ ఖరారు చేసుకోనున్నారు. సీనియర్లమని విర్రవీగితే తీసి పక్కన పెట్టేస్తామని జంబో టీమ్ ఎంపికతో హైకమాండ్ హెచ్చరికలు పంపిన నేపథ్యంలో సీనియర్ల అసమ్మతి కూడా ఆగిపోవడం ఖాయం..రేవంత్ ఇంకాస్త దూకుడు పెంచడం లాంఛనమే