టీపీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. సర్పంచ్ ల సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్ తో సోమవారం ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు రేవంత్ రెడ్డిని ముందస్తుగా హౌజ్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మొహరించారు. ఇక, ఇందిరా పార్క్ కు బయల్దేరిన కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు ఎక్కడిక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.
సర్పంచ్ ల సమస్యలపై కాంగ్రెస్ వెంటనే రియాక్ట్ అయింది. గ్రామ పంచాయితీలకు ఇవ్వాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోగా… కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదోవ పట్టించడంతో వెంటనే సర్పంచ్ ల సమస్యలపై కాంగ్రెస్ కార్యచరణ ప్రకటించింది. నిజానికి, ఈ అంశంలో లీడ్ తీసుకోవాల్సిన బీజేపీ పేపర్ ప్రకటనలకే పరిమితమైంది. కాంగ్రెస్ మాత్రం ధర్నాలకు పిలుపునిచ్చి రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపడుతామని ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సర్పంచ్ లు రాజీనామాలు చేస్తుండటంతో ఏం చేయాలో పాలుపోని రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ధర్నా మరింత ఇరుకున పెట్టడం ఖాయమని గుర్తించింది. అందుకే ఈ ధర్నాకు సర్కార్ పర్మిషన్ ఇవ్వలేదు.
Also Read : రేవంత్ ను ఫాలో అవుతోన్న బండి సంజయ్
నిజానికి స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా పంచాయితీలకు ప్రతి నెల నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ చూపడం లేదు. పైగా కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు మంజూరు చేసిన నిధులను దొంగచాటుగా దారి మళ్లించింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల పరిస్థితి అధ్వానంగా మారింది. ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్ లకు ఈఎమ్ఐలు కట్టలేని పరిస్థితిలో సర్పంచ్ లు ఉన్నారు. పంచాయతీ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారు.
సర్పంచ్ లు అప్పులు చేసి పంచాయితీలను అభివృద్ధి చేయగా.. అప్పుల బాధ ఎక్కువైంది. మిత్తిలు అసలు కన్నా ఎక్కువ అయ్యాయి. దీంతో అప్పుల బాధతో పలువురు సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయిన సర్కార్ కరుణించడం లేదు. పంచాయితీ నిధుల విడుదలపై స్పష్టమైన ప్రకటన కూడా చేయలేదు. అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులు ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పకపోవడంతో సర్పంచ్ లలో కూడా ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.
Also Read : టి. బీజేపీలో సీఎం చైర్ కొట్లాట – డీకే అరుణ వర్సెస్ ఈటల