తెలంగాణ కాంగ్రెస్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై నిరుద్యోగ మహా దీక్షకు రేవంత్ హాజరు కానున్న నేపథ్యంలో జూబ్లిహిల్స్ లోని ఆయన నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఓయూ జేఏసి నేతృత్వంలో శుక్రవారం, శనివారాల్లో రెండురోజులపాటు ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో నిరుద్యోగ మహా దీక్ష జరగనుంది. ఈ దీక్షకు ముఖ్య అతిథిగా రేవంత్ సంఘీభావం తెలపనున్నారు. అయితే ఈ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. రేవంత్ మాత్రం దీక్షకు హాజరై తీరుతానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రేవంత్ ఇంటి ఎదుట పోలీసులు భారీగా మొహరించారు.
రేవంత్ రెడ్డి ఓయూకు వెళ్ళకుండా ఆయన బయటకు వచ్చిన వెంటనే అరెస్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన ఇంటికి వెళ్ళే దారులన్నీ క్లోజ్ చేశారు. రేవంత్ ను ఎవరూ కలవకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. వచ్చిన వారిని వచ్చినట్టుగా అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు.