బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ లక్ష్యం కోసం రాజేందర్ బీజేపీలోకి వెళ్ళాడో .. ఆ లక్ష్యం అక్కడ నెరవేరడం లేదని ఆయన మాటల్లో స్పష్టమైందన్నారు. కేసీఆర్ ను గద్దె దించాలన్న లక్ష్యంతో రాజేందర్ బీజేపీలో చేరారని కానీ, బీజేపీలోకి వెళ్ళాక అక్కడ కేసీఆర్ కోవర్ట్ లు ఉన్నారని ఈటెలకు అర్థమైందన్నారు.
రాజేందర్ లక్ష్య సాధన కోసం ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కోవాల్సి పరిస్థితి వచ్చిందని రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను గద్దె దించాలనే లక్ష్యంతో బీజేపీలో చేరిన నాయకులు .. ఇప్పుడు ఆ పార్టీలో సంతృప్తిగా లేరన్నారు. బీజేపీ కేసీఆర్ ఒక్కటేనన్న విషయం ఈటెల రాజేందర్ మాట్లల్లో స్పష్టమైందని తెలిపారు.కేసీఆర్ విష ప్రయోగంలో ఈటెల కూడా పాత్రధారి అవుతున్నాడని.. రాజెందర్ కు ఇష్టం లేని పనులను కేసీఆర్ చేపిస్తున్నారన్నారు. ఈటెల లెఫ్టిష్ట్… కానీ రైటిస్ట్ పార్టీలోకి పోయేలా చేసాడన్నారు. ఈటెల కు ఎన్నికల్లో డబ్బులు పంచడం ఇష్టం లేదు.. కానీ హుజురాబాద్ ఎన్నికల్లో ఖర్చు పెట్టించాడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ కు అంబెడ్కర్ మీద మొదటి నుంచి కక్షేనన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ బర్త్ డే రోజు కాదు, అంబెడ్కర్ జయంతి రోజున సెక్రటరియేట్ ను ప్రారంబిస్తే గౌరవం ఉండేదన్నారు. ఈటెల, వివేక్, విశ్వేశ్వర్ రెడ్డి.. బీజేపీ సిద్దాంతాలను విశ్వసించరు..కేవలం కేసీఆర్ ను మాత్రమే వ్యతిరేకిస్తారన్నారు. బీజేపీ ఐడీయాలజీతో ఆ ముగ్గురికి అస్సలు సంబంధం లేదన్నారు. హుజురాబాద్ అయినా మునుగోడు అయినా సంధర్బానుసారమే బీజేపీకి ఓట్లు పడ్డాయని తాను చెప్పిందే ఈటల చెప్పారన్నారు రేవంత్ రెడ్డి. మిగతా సంధర్భాలలో బీజేపీకి ఆ ఓట్లు పడవన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో భట్టి విక్రమార్క మాట్లాడుతున్నాడని…ఆయన పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతను పార్టీ హైకమాండ్ భట్టికి అప్పగించిందన్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కఠినతరం చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయడానికి 25సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు తగ్గిస్తామన్నారు. కలెక్టర్ గా 21 సంవత్సరాల అధికారి భాధ్యతలు నిర్వహించగా.. 21సంవత్సరాల వ్యక్తి ఎమ్మెల్యే గా ఎందుకు పోటీ చేయకూడదని ప్రశ్నించారు.