అన్ని పార్టీల కంటే ముందుగానే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ ఎన్నికలను సన్నాహాలను ముందుగానే ప్రారంభించినట్లు కనిపించింది. కానీ, అభ్యర్థుల ప్రకటన తరువాత ఆయన అనుకున్నంత స్థాయిలో ఎన్నికల ముందు నిర్వహించే కార్యక్రమాలను చేపట్టలేకపోతున్నారు. ప్రతి సారి ఎన్నికల ముందు కేసీఆర్ ఆయుత చండీయాగం నిర్వహిస్తూ ఉంటారు. ఈసారి మాత్రం ఆయన చండీయాగం చేయలేదు. ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి సీఎం అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం మొదటిసారి చండీయాగం నిర్వహించారు.
మూడు రోజులపాటు కొడంగల్ లోని తన నివాసంలో చండీయాగం నిర్వహించగా చివరి రోజు కుటుంబ సమేతంగా రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా లాంటి కేసీఆర్ పీడ విరగడ కావాలనే చండీయాగం నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజాస్వామ్య పాలన రావాలని ఆకాంక్షించిన రేవంత్.. అది కాంగ్రెస్ తోనే సాధ్యమని తెలిపారు. రేవంత్ రెడ్డి గతంలో యాగాలు చేయలేదు. కానీ ఈసారి మాత్రం ఆయన కేసీఆర్ లాగే ఆలోచించారు. ఎన్నికల షెడ్యూల్ వస్తుందని భావిస్తోన్న తరుణంలోనే చండీయాగం పూర్తి చేశారు.
ఈసారి కూడా ఎన్నికల ముంగిట కేసీఆర్ ఆయుత చండీయాగం నిర్వహిస్తారా..? లేదా అన్నది స్పష్టత లేదు. ప్రస్తుతం కేసీఆర్ కు వైరల్ ఫీవర్ తగ్గలేదని తెలుస్తోంది. దీంతోనే శుక్రవారం నిర్వహించాల్సిన కేబినేట్ భేటీ వాయిదా పడింది. కేసీఆర్ వైరల్ ఫీవర్ నుంచి కోలుకున్నాక కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలకు ధీటుగా మ్యానిఫెస్టోను ప్రకటించి ఎన్నికల రణక్షేత్రంలోకి వెళ్తారని అంటున్నారు.
Also Read : సీన్ రివర్స్ – కేసీఆర్ టైం బ్యాడ్ ..!!