2017లో సూచీ లీక్స్ ఎంతటి సంచలనం సృష్టించాయో చెప్పక్కర్లేదు. ధనుష్, అనిరుధ్, రానా, త్రిష, ఆండ్రియాతో పాటు పలువురి రాసలీల ఫోటోలు, వీడియోలు బయటకు రావడం సంచలనంగా మారింది. సినీ ఇండస్ట్రీపై కోపంతో సింగర్ సుచిత్ర ఈ వీడియోలను బహిర్గతం చేసింది.
సుచిత్ర దెబ్బకు సినీ ప్రముఖులు చాలామంది భయపడ్డారు. ఇంకెంతమంది ప్రముఖుల ప్రైవేట్ వీడియోస్ బయటకు వస్తాయోనని ఆందోళన చెందారు. అయితే.. ధనుష్, అనిరుద్ తనకు మద్యం తాగించి మత్తులో తనను లైంగికంగా వాడుకున్నారని సుచిత్ర ఆరోపించింది. మరో సింగర్ చిన్మయిపై కూడా సుచిత్ర ఆరోపణలు గుప్పించింది.
అయితే.. ఈ సుచిలీక్స్ కు బలైన వారిలో నటి రేష్మ పసుపులేటి కూడా ఉన్నారు. ఆమెకు సంబంధించిన ఓ ప్రైవేట్ వీడియోకు బయటకొచ్చింది. బాయ్ ఫ్రెండ్ తో బెడ్ షేర్ చేసుకుంటున్నట్లున్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. అప్పుడే కోలీవుడ్ లో ఎదుగుతున్న రేష్మ పసుపులేటి ప్రైవేట్ వీడియో బయటకు రావడం కలకలం రేపింది. ఆ వీడియో వలన ఆమెకు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గుముఖం పట్టాయనే ప్రచారం ఉంది. ఆ వీడియో గురించి రేష్మా పసుపులేటి తాజాగా స్పందించారు.
ఆ వీడియో గురించి నాకు మా చెల్లెలు చెప్పే వరకు తెలియదు. అక్కా నీ ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పింది. బాయ్ ఫ్రెండ్ తో బెడ్ షేర్ చేసుకుందని నా గురించి ప్రచారం చేశారు. అప్పుడు నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. ఇప్పటికీ సింగల్ గానే ఉన్నాను. ఆ వీడియోలో నా ఫేస్ ను మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేశారంటూ రేష్మ పసుపులేటి చెప్పుకొచ్చింది.
What a strong women 🔥🔥🔥🔥 pic.twitter.com/iYX7zoChLN
— Vishnu® (@Vishnu1310) December 29, 2022