తెలుగు మీడియా దిగ్గజం రవి ప్రకాష్ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఆర్ టీవీకి అప్పుడే సమస్య వచ్చి పడింది. రిపబ్లిక్ టీవీ లోగో, ఆర్ టీవీ లోగో ఒకే రకంగా ఉన్నాయని… ఇది కాపీరైట్ ఉల్లంఘేనని ముంబై హైకోర్టులో రిపబ్లిక్ టీవీ మేనేజ్ మెంట్ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. రిపబ్లిక్ టీవీని పోలినట్లుగా ఆర్ టీవీ లోగో ఉన్నదని.. ఇది తమ సంస్థకు నష్టం కల్గించేలా ఉందని రిపబ్లిక్ టీవీ యాజమాన్యం తరుఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. ఆర్ టీవీ అనే మూడు అక్షరాలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. తమ తరుఫున దాఖలు చేసిన అప్లికేషన్ పిటిషన్ ఇంకా కేంద్ర మంత్రిత్వ శాఖ వద్ద పరిశీలనలో ఉందని ఆర్ టీవీ తరుఫు న్యాయవాదులు చెప్పుకొచ్చారు. ఇంకా ఆర్ టీవీ ప్రసారాలు ప్రారంభం కాలేదని, శాటిలైట్ టీవీ ఛానెల్ లో లోగో డిస్ ప్లే కావడం లేదని వాదించారు.
ఇకపోతే, అర్నాబ్ గోస్వామి ఆధ్వర్యంలో నడిచే రిపబ్లిక్ టీవీ యాజమాన్యానికి ఆర్ టీవీ క్లారిటీ ఇచ్చింది. అసలు రిపబ్లిక్ టీవీ లోగోకు, ఆర్ టీవీ లోగోకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం కొనసాగుతోన్న ఆర్ టీవీ ఎప్పటి నుంచో నడుస్తోందని ఇందుకు సంబంధించిన రికార్డులు పంపారు. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ నుంచి ఇప్పటికే ఆర్ టీవీ అనుమతి కోరిందని.. ఓ దరఖాస్తు ఆ శాఖ దగ్గర పెండింగ్లో ఉందని తదుపరి విచారణను కోర్టు జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది.