ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ అద్యక్షుడు , ఎంపీ రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష విధించింది. ఈ జైలు శిక్ష విధించడంతో లోక్ సభ సెక్రటేరియట్ రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసింది. ప్రభుత్వ వ్యతిరేకులు ముఖ్యంగా పోటీదారులపై వ్యవస్థలు ఎంత వేగంగా స్పందిస్తాయో రాహుల్ గాంధీ విషయంలో స్పష్టమైంది.
ఈ క్రమంలోనే కేంద్ర మాజీ మంత్రి , కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి స్పందించారు. రాహుల్ గాంధీ విషయంలో కోర్టులు , వ్యవస్థలు చాలా వేగంగా స్పందించాయని తెలిపారు. ఇప్పుడు ప్రధాని విషయంలోనూ అదే తరహాలో స్పందించాలని రేణుకా చౌదరి కోరారు. ప్రధాని నరేంద్ర మోడీపై తాను పరువు నష్టం దావా వేయబోతున్నట్లు ఆమె చెప్పారు.
2018లో పార్లమెంట్ లో తనను శూర్పణఖతో ప్రధాని పోల్చారని… దీనికి సంబంధించిన వీడియోను ఆమె ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ కామెంట్స్ పై తాను పరువు నష్టం కేసు వేయబోతున్నట్లు చెప్పారు. ఈ విచారణను కోర్టులు ఎంత వేగంగా పూర్తి చేస్తాయో చూస్తానని అన్నారు. రాహుల్ గాంధీ విషయంలోనూ స్పందించినట్లే ప్రధాని విషయంలోనూ స్పందిస్తే నరేంద్ర మోడీకి కూడా రెండేళ్ళ జైలు శిక్ష పడుతుందేమో చూడాలని అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
This classless megalonaniac referred to me as Surpanakha on the floor of the house.
I will file a defamation case against him. Let's see how fast courts will act now.. pic.twitter.com/6T0hLdS4YW
— Renuka Chowdhury (@RenukaCCongress) March 23, 2023