అకీరానందన్ బర్త్ డే సందర్భంగా పవన్ అభిమాని చేసిన కామెంట్ కు రేణు దేశాయ్ ఇచ్చిన రిప్లై వివాదస్పదం అవుతోంది. మా అన్న కొడుకు ఎలా ఉన్నాడో చూపించండని రేణు దేశాయ్ ను ట్యాగ్ చేస్తూ పవన్ అభిమాని ఒకరు సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. అంతే. అంతమాత్రం దానికే రేణు దేశాయ్ విరుచుకుపడింది. అకీరాను మా అన్న ( పవన్ ) కొడుకు అన్నాడని ఆమె తీవ్రంగా తప్పుబట్టింది. అకీరా నా కొడుకు అని బదులిస్తూ అసలు నువ్వు ఒక తల్లికే పుట్టావా..? ముందు మాట్లాడటం నేర్చుకో అంటూ పవన్ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎవరూ ఊహించని విధంగా రేణు దేశాయ్ నుంచి రిప్లై రావడంతో నెటిజన్స్ అంత ఆశ్చర్య పోయారు. పవన్ కొడుకు అంటే మీ కొడుకు కాదని అర్థం కాదు కదా మేడం…ఇంత చిన్న విషయానికి ఇలా రిప్లై ఇవ్వడం సరైంది కాదంటూ సదరు నెటిజన్ కు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికలు వస్తున్నాయని కావాలనే పవన్ ఇమేజ్ తగ్గించేలా ఈ విషయాన్నీ పెద్దది చేయాలనుకుంటున్నారని టాపిక్ ను మరో వైపు తీసుకెళ్ళారు. ఇలా పవన్ అభిమానులతో రేణు దేశాయ్ కు వార్ కొనసాగుతుండగా తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.
ఆ వీడియోలో ఓ మహిళా మాట్లాడుతూ.. రేణు, సమంతలకు మద్దతుగా నిలిచింది. ఇండస్ట్రీలో ఎవరైనా విడాకులు తీసుకుంటే అందులో హీరోయిన్ ను మాత్రమే తప్పనే విదంగా ప్రచారం చేస్తారని చెప్పుకొచ్చింది. అందరూ హీరో వైపు మద్దతుగా నిలబడుతారని తద్వారా విడాకులు పొందిన హీరోయిన్స్ మానసిక సంఘర్షణకు గురి అవుతారని వ్యాఖ్యానించింది. అలాంటి సమయంలోనే వారికి మద్దతుగా నిలవాలని ఆ వీడియోలో స్పష్టం చేసింది.
ఆమె ఎవరో నాకు తెలియదు కాని నా గురించి మాట్లాడుతుంటే కన్నీళ్లు మాత్రం ఆగలేదని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయానని మాట్లాడుతుంటే నన్ను అర్థం చేసుకునేవారే లేరా అనిపించిందని సరిగ్గా ఇలాంటి సమయంలో ఈ వీడియో చూశాక తనను అర్థం చేసుకునే వారు కూడా ఉన్నారనిపించిందని రేణు దేశాయ్ తెలిపింది. ఈ వీడియో చూశాక ధైర్యం వచ్చిందని పేర్కొంది.
https://www.instagram.com/reel/Cq0ElJCBBs0/?utm_source=ig_web_copy_link
Also Read : ఎన్నికల్లో పవన్ ను ఓడించేందుకు రేణు దేశాయ్ కుట్ర చేస్తోందా..?