అయ్యప్ప స్వామిపై బైరి నరేష్ చేసిన వ్యాఖ్యలను మరవకముందే సరస్వతి అమ్మవారిపై రేంజర్ల రాజేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సరస్వతి మాతపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాజేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని హిందుత్వ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే పోరాటాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించాయి.
Also Read : బైరి నరేష్ తో బండి సంజయ్ భేటీ – ఆ తరువాతే అసలు కథ..!
సరస్వతీ అమ్మవారు చదువుల తల్లి కాదని, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ గిటార్ ఎలా పట్టుకుంటాడో.. అమ్మవారు వీణ అలా పట్టుకుంటుంది కాబట్టి..ఆవిడ మ్యూజిక్ టీచర్ అని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు రాజేష్. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ బాసరలో బంద్ కు పిలుపునిచ్చారు.
ఉదయం నుంచే స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలు, దుకాణాలు,స్కూల్స్ మూసివేసి గ్రామస్తులు బంద్‌లో పాల్గొన్నారు. రోడ్లపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్థులు రేంజర్ల రాజేశ్ దిష్టిబోమ్మను దగ్దం చేశారు. ఈ క్రమంలోనే ఆలయ అర్చకులతో పాటు పలువురు నిరసనకు దిగారు. రాజేష్‌పై పిడి యాక్ట్ పెట్టాలని రాస్తారోకో చేపట్టారు. అనంతరం రాజేష్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. బాసర అమ్మవారి ఆలయ అర్చకులు రాజేష్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రీసెంట్ గా అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌కు మద్దతుగా రేంజర్ల రాజేష్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. దీంతో అతడి ఇంటి ముందు హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. భైరి నరేష్‌ను సమర్థిస్తూ పోస్టులు పెట్టినందుకు రేంజర్ల రాజేష్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత ఆయన క్షమాపణలు కూడా చెప్పిన సంగతి తెలిసిందే.
Also Read : బైరి నరేష్ అలా మాట్లాడొచ్చా..?