ఐదు నెలల విరామం తరువాత టీమిండియా తరుఫున ఆడుతోన్న రవీంద్ర జడేజా ఆసీస్ తో మ్యాచ్ లో అదరగొట్టేశాడు. మోకాలి గాయం నుంచి కోలుకున్న తరువాత మొదటి మ్యాచ్ ఆడుతోన్న జడేజా బౌలింగ్ పవర్ చూపాడు. గురువారం నుంచి ప్రారంభమైన బోర్డర్ – గవాస్కర్ టెస్ట్ సీరిస్ లో తన స్పిన్ మాయాజాలంతో కంగారులను కంగారు పెట్టించాడు.
మొదటి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి తను ఎంత విలువైన ఆటగాడో మరోసారి నిరూపించాడు జడేజా. స్పెషలిస్ట్ స్పిన్నర్ లా కంటే మెరుగ్గా బౌలింగ్ చేశాడు. బంతిని గింగిరాలు తెప్పి ఆసీస్ బ్యాట్స్ మెన్ ను ఒకరెనుక ఒకరిని పెవిలియన్ బాట పట్టించాడు. ఇరవై రెండు ఓవర్లు వేసిన జడేజా 47 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆసిస్ తొలి ఇన్నింగ్ లో 177 పరుగులకు పరిమితమైయింది.
ఆ తరువాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా.. మొదటి రోజు సమయం ముగిసే సరికి 22ఓవర్లలో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. మరో ఓవర్ లో మ్యాచ్ ముగుస్తుందనగా ఓపెనర్ కేఎల్ రాహుల్ అవుట్ అయ్యారు. మొదటి నుంచి కూడా బౌలర్లను ఎదుర్కొనేందుకు రాహుల్ తడబడుతు కనిపించాడు. మరో ఎండ్ లో రోహిత్ శర్మ మాత్రం వన్డే తరహాలో బ్యాట్ కు పని చెప్పాడు. ఫోర్లతో స్కోర్ బోర్డును పరిగేత్తించాడు. 69బంతుల్లో 56పరుగులు(9ఫోర్లు, ఓ సిక్సర్) చేసి నాటౌట్ గా నిలిచాడు. ఓవర్ నైట్ బ్యాట్స్ మెన్ గా వచ్చిన అశ్విన్ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు.