సమంత తనకు క్లోజ్ ఫ్రెండ్ అని హీరోయిన్ రష్మిక మందన తాజా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. మీడియాతో ఆమె మాట్లాడుతూ సమంత ఓ నటియే కాదు. చాలా మంచి మనస్తత్వం ఉన్న స్త్రీ అని వ్యాఖ్యానించింది.
మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు సమంత నాతో చెప్పేవరకు తనకు తెలియదని తెలిపింది రష్మిక. సమంత నాతో కలిసిన సందర్బాలలో ఏనాడు కూడా మయోసైటిస్ గురించి చెప్పలేదని వెల్లడించింది. ఈ వ్యాదితో బాధపడుతున్న సమంతకు మరింత హాని కలుగకుండా ఆమెలో మనోస్థైర్యాన్ని నింపి తనను అమ్మలా రక్షించుకుంటానని రష్మిక తెలిపింది.
జీవితంలో ఇబ్బందులనుఎదుర్కొనే వక్తుల నుంచి అందరు స్పూర్తి పొందుతారని, తాను కూడా సమంత నుండి అదే స్ఫూర్తి పొందుతానని పేర్కొంది. తనకు అత్యంత సన్నిహితురాలయిన సమంత త్వరలోనే కోలుకోవాలని మనస్పూర్తిగా ఆ దేవుడిని వేడుకుంటున్నానని వ్యాఖ్యానించింది.
తాను హీరోయిన్ గా నటించిన పుష్ప మూవీ లో ” ఊ అంటానా మామ ఊ ఊ అంటావా మామ “అనే ఐటమ్ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ కు సమంత నటననే కారణం అని తెలిపింది.
Also Read : బడా వ్యాపారవేత్తతో శ్రీముఖి ప్రేమాయణం – త్వరలోనే పెళ్లి..?