జబర్దస్త్ కామెడి షో లోకి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మీ మాటలతోనే మెస్మరైజ్ చేయడం కాదు గ్లామర్ ను కూడా ప్రదర్శించింది. అందుకే రష్మీకి తొందరగా ఇండస్ట్రీ వర్గాల్లో గుర్తింపు లభించింది. అలాగే, సుడిగాలి సుధీర్ తో లవ్ ట్రాక్ సెట్ చేయడం కూడా రష్మీకి ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. బోల్డ్ గా నటించేందుకు ఏమాత్రం వెనుకంజ వేయని రష్మీకి వెండితెర నుంచి కూడా అవకాశాలు వచ్చాయి. రష్మీ రెండు, మూడు సినిమాల్లో నటించగా.. హీరోయిన్ గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. గుంటూర్ టాకీస్ మూవీలో రెచ్చిపోయి మరీ అందాలను ఆరబోసినా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది ఆ సినిమా.
సినిమాలో సక్సెస్ కాకపోవడంతో బుల్లితెరపై బలమైన ముద్ర వేస్తోంది రష్మీ. జబర్దస్ట్ తోపాటు ఇతర షోలలో పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల జబర్దస్త్ కు రష్మీ గుడ్ బై చెప్పిందని వార్తలు వచ్చాయి కాని జబర్దస్త్ ను వీడేది లేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మీ షాకింగ్ కామెంట్స్ చేసింది.
కాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ బోల్డ్ కామెంట్స్ చేసింది రష్మీ. పరస్పర అంగీకారంతో శారీరకంగా కలిస్తే తప్పేంటి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎదుటివారు ఒప్పుకోకుండా ఏ పని జరగదని, అలాంటప్పుడు కాస్టింగ్ కౌచ్ అనే పేరు పెట్టడం అర్థం లేదని వ్యాఖ్యానించింది. ఇండస్ట్రీలో ఎవరో ఒకరి సపోర్ట్ లేకుండా ఎదగటం కష్టమని చెప్పింది.
రష్మీ చేసిన ఈ కామెంట్స్ పై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. కాస్టింగ్ కౌచ్ అనేది లేదంటూ ఆమె వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రష్మీ బుల్లితెరపై నిలదొక్కుకోగలిగింది కాబట్టి ఏమైనా మాట్లాడుతుందని కాని, ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.