బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ నటించిన సినిమాలు ఆ మధ్య సరిగ్గా ఆడలేదు. కెరియర్ పోతోంది అనుకుని భయపడ్డాడు. అందుకే సల్మాన్ ఖాన్ లాగా అమ్మాయిల మనసు దోచుకోవాలని అనుకుని పూర్తిగా నగ్నంగా మోడలింగ్ చేశాడు. అతను విడుదల చేస్నిన ఆ నగ్న ఫోటోలు దేశవ్యాప్తంగా వైరల్ గా మారాయి. అతను ఆబాసు పాలు అయ్యాడు. అటు ఆడవాళ్ళు, ఇటు మగాళ్ళు తిట్టేసరికి సిగ్గుతో ‘సారి’ చెప్పాడు. ఇకపై అలాంటి మోడలింగ్ చేయను అని లెంపలు వేసుకున్నాడు.
కానీ ఆ తర్వాత అతను నటించిన’ బ్రహ్మాస్త్ర’ సినిమాలో హ్యాండ్సమ్ లవర్ బాయ్ గా కనిపించి ఆకట్టుకున్న రణబీర్ కు గొప్ప ఉరట కలిగించింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. కానీ అతను ఎదురు చూస్తున్న రూ. 500 కోట్ల క్లబ్ లో ఇంకా చేరలేదు. అందుకే మరోసారి న్యూడ్ మోడలింగ్ చేసి తన తదుపరి సినిమాను కూడా ఇలాగే హిట్ చాయాలని ఆలోచనలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అతనికి ఈ సెంటిమెంట్ బాగా పట్టుకుంది. ఇది ‘నగ్న’ సత్యం మరి.
అందుకే ఇప్పుడు జీరో ఫ్యాట్ రిప్డ్ బాడీలో కనిపించి అందరిని షాక్ కు గురి చేశాడు. తన తదుపరి సినిమా ప్రమోషన్ కోసమే ఇలా ఫోటోలు విడుదల చేశాను అని గర్వంగా చెపుతున్నాడు. తన ఫిట్ నెస్ కోచ్ శివోహం ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేసిన రణబీర్ కపూర్ పవర్ ప్యాక్డ్ బాడీ ఫోటోలు ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి.
పాత ‘నగ్న’ సెంటిమెంట్ ఫలిస్తే ఇప్పుడు రాబోయే సినిమా కూడా హిట్ కావచ్చు. అలా జరిగే అతను ప్రతి సినిమాకు ముందు ఇలాంటి నగ్న ఫోజులు ఇచ్చి దేశాన్ని హడలెత్తించే విధంగా ఉన్నాడు.