త్వరలోనే సీనియర్ నటుడు నరేష్ నాలుగో వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించారు. నటి పవిత్రతో కలిసి సహజీవనం చేస్తోన్న నరేష్ న్యూ ఇయర్ లో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నట్లు ఇటీవల ఓ వీడియోను రిలీజ్ చేశారు.
ఈ వీడియోలో నటి పవిత్ర, నరేష్ లు ఇద్దరు కలిసి ముద్దు పెట్టుకున్న సీన్ ఉంది. న్యూ ఇయర్ టైంలో బాగా ఈ వీడియో వైరల్ అయింది. అయితే, ఈ వీడియో బయటకొచ్చిన తరువాత నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది.
నరేష్ కు చాలా మందితో అక్రమ సంబంధాలు ఉండేవి. ఆయన చాలా దుర్మార్గుడు. తప్పులన్నీ ఆయనే చేసి నాపై నిందలు వేస్తున్నాడు. దేవుడులాంటి కృష్ణగారితో నాకు అక్రమ సంబంధం అంటగట్టిన నీచుడు నరేష్ అని ఆరోపించారు. ఇందుకు సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని తెలిపింది.
ఇప్పటివరకు ఈ విషయాలను ఎక్కడ బయటపెట్టలేదని చెప్పారు రమ్య. కృష్ణగారి గౌరవ మర్యాదలు దెబ్బతినవద్దని ఆగిపోయానని పేర్కొంది. నరేష్ దారుణాలు పెరిగిపోతున్నాయని అందుకే నోరు విప్పాలని డిసైడ్ అయినట్లు చెప్పింది. నరేష్ నన్ను వదిలించుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. చివరికి కృష్ణ గారి సంతకాన్ని ఫోర్జరీ చేసి నాకు ఇంజక్షన్స్ సూట్ పంపాడు.
ఆయనకు పంపిన ఇంజక్షన్ సూట్ లో నా నుంచి కృష్ణగారికి ముప్పు పొంచి ఉందని రాశాడు. ఇంతకంటే దారుణం ఏంటంటే..కృష్ణగారికి నాతో అక్రమ సంబంధం ఉందని సూట్లో చెప్పారని రమ్య రఘుపతి ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ విషయాన్ని కృష్ణగారి దృష్టికి తీసుకెళ్ళ,మని మా ఫ్యామిలీ వాళ్ళు చెప్పారు కాని నరేష్ వలన ఆయన గౌరవం దెబ్బతినకూడదని ఆగిపోయానని చెప్పారు.
నరేష్ నా నుంచి విడాకులు పొందేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు విడాకులు ఇచ్చేదే లేదు. విడాకుల కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది. నా కొడుకు నాన్న కావాలని కోరుతున్నాడు. అందుకే నరేష్ కు విడాకులు ఇవ్వబోనని తేల్చి చెప్పింది.
పవిత్ర గురించి కూడా రమ్య చెప్పుకొచ్చింది. మొదటిసారి పవిత్రను నరేష్ నాకు పరిచయం చేసినప్పుడు ఇద్దరం కన్నడలోనే మాట్లాడుకున్నాం. ఆమెకు తన చేతితోనే అన్నం వడ్డించానని చెప్పుకొచ్చింది. అలాంటిది తనకే ద్రోహం చేస్తుందని ఊహించలేదని బాధపడింది రమ్య. వారి పెళ్లి అసలు జరగనివ్వని స్పష్టం చేసింది.