మన రాజ్యాంగం మనకు అన్ని రకాల స్వేఛ్చ నిచ్చింది. కానీ తాగి ఊగమనేస్వేఛ్చనివ్వలేదు. అందుకే దేశ వ్యాప్తంగా తాగుబోతులు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు. తాగు బోతులు ఎలాగో మారరు. మరి రాజ్యాంగాన్ని మార్చక తప్పదేమో?
కేరళలోని కొచ్చిన్ లో పీకల వరకు తాగున్న ఓ బస్సు డ్రైవర్ ద్వి చక్ర వాహనం నడుపుతున్న వ్యక్తిని వెనకనుంచి గుద్ది చంపాడు. ఆ కేసు కోర్టుకు వెళ్ళింది. ట్రాఫిక్ పోలిసుల మీది హైకోర్ట్ కన్నెర చేసింది. తాగుబోతుల పట్ల మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రియులకు వేయని ఫైన్ లేదు, తిట్టని బూతులు లేవు. కొట్టని దెబ్బలు లేవు. ఎం చేయాలో వాళ్ళకు తోచలేదు. చివరికి ఓ గొప్ప ఆలోచన వచ్చింది.
తాగుబోతులను పరీక్షా హాలులోలా నేల మీది వరుస క్రమంలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత తెల్లకాగితాలు ఇచ్చారు. ఎదో పరీక్ష అనుకుని తాగుబోతులు తేలికగా తీసుకున్నారు. కానీ చివరికి వాళ్ళు చెప్పింది విని షాక్ అయ్యారు.
“ఇకపై తాగి డ్రైవింగ్ చేయను” అనే వాక్యాని రామ కోటిలా వెయ్యి సార్లు తప్పులు లేకుండా రాయమన్నారు. ఒక తప్పుకు మరో వెయ్యిసార్లు రాయాల్సి ఉంటుంది అని బెదిరించారు. అంతే ఆ తాగుబోతుల మత్తు దిగింది. అది రాయడం కంటే రామ కోటి రాసినా పుణ్యం వచ్చేదని ఏడుస్తూ రాశారు.
ఆ తర్వాత ఒక్కడు తాగి బండి నడిపితే ఒట్టు. దీనిని తెలంగాణ పోలీసులు కూడా అమలు చేస్తే బాగుడేది కదుల్లా!