టాలీవుడ్ ముద్దుగుమ్మ, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సినిమా షూటింగ్ లో భాగంగా ముద్దు సీన్స్ , స్కిన్ షో చేయాల్సి వచ్చినప్పుడు హీరోయిన్స్ ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేస్తారో తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ముద్దు సీన్స్ చేసే సమయంలో హీరోయిన్స్ మాత్రమే కాదు హీరోలు కూడా సిగ్గు పడుతుంటారని చెప్పుకొచ్చింది. ఆ సీన్స్ చేసే సమయంలో కొంత భయాందోళనకు గురి కావడం జరుగుతుంటుందని చెప్పింది. ఎందుకంటే అందరి ముందు అలాంటి సీన్స్ చేయడం అంత ఈజీ కాదు కదా అని వివరించింది.
ఇకపోతే, సినిమాలతోపాటు రకుల్ వ్యక్తిగత జీవితం కూడా చర్చలో నిలుస్తునే వస్తోంది. జాకీ భగ్నానితో రకుల్ డేటింగ్ చేస్తోంది. ఇద్దరూ కలిసి సన్నిహిత బంధాన్ని కూడా పంచుకుంటున్నారు.
ఇటీవల జాకీ పుట్టిన రోజు మరియు క్రిస్మస్ వేడుకలలో రకుల్ ప్రీత్ కనిపించింది. పీకలోతు ప్రేమలో మునిగితేలుతున్నారు. త్వరలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది.
Also Read : చిరుతో స్లివ్ బ్లౌజ్ తో కష్టంగా అనిపించిందన్న శృతి హసన్