బాలీవుడ్ నటి రాఖీ సావంత్. ఎప్పుడు ఎదో ఒక విషయమై వార్తల్లో నానుతూనే ఉంటుంది. తాజాగా ఆమె భర్త ఆదిల్ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేసింది. ఓ అమ్మాయితో ఆదిల్ ఎఫైర్ పెట్టుకున్నాడని ఆరోపించింది.
భర్త ఆదిల్ ఖాన్ తో వివాదం ఏంటని రాఖీ సావంత్ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఆదిల్ ఓ అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడని..విషయం తెలిసి నిలదీస్తే ఆమెను వదిలేస్తానని చెప్పి మోసం చేశాడని ఆరోపించింది. ఆదిల్ ఖాన్ ఎప్పుడు అబద్దాలు చెప్తుంటాడని తెలిపింది. పైగా, ఆ అమ్మాయి ఆదిల్ ని బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఆమె వద్ద ఆదిల్ చండాలమైన వీడియోలు, ఆడియోలు ఉన్నాయి. అవి బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేస్తుందని వివరించింది.
దయచేసి ఆదిల్ ను ఇంటర్వ్యూలు చేసి హీరోను చేయకండి.. మీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ ఎమోషనల్ అయింది రాఖీ సావంత్. మీడియాలో కనిపించి ఆదిల్ హీరో కావాలనుకుంటాడని విమర్శించింది. తాను కూడా ఇక నుంచి ఆదిల్ గురించి మాట్లాడనని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
నటుడు ఆదిల్ ఖాన్ ని 2022లో రాఖీ సావంత్ వివాహం చేసుకుంది. కనీసం ఏడాది గడవకుండానే అతనితో మనస్పర్థలు ఏర్పడ్డాయి. రహస్యంగా అతను అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నడంటూ రాఖీ సావంత్ ఆరోపిస్తోంది. 44 ఏళ్ల ఈ నటి 2019లో రితేష్ సింగ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. విడాకులు తీసుకున్న రాఖీ సావంత్ ఆదిల్ ఖాన్ ని రెండో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత కొన్నాళ్ళకే ఈ రచ్చ మొదలైంది.