రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు మామూలుగా ఉండవు..ఓ పట్టాన అర్థం అవ్వవు..తమ రాజకీయ లబ్దికోసం రాజకీయనాయకులు, పార్టీలు ఎన్ని ఘోరాలు చేయడానికైనా వెనకాడవు. నాకు జరిగిన ఒక అనుభవం, రాజకీయం ఎంత నీచమో తెలిసేలా చేసింది..
వారం క్రితం కరీంనగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్న శ్వేత హోటల్ లో బైరి నరేష్ కూర్చొని ఉన్నాడు..నేను అదే హోటల్ లో రిసెప్షన్ లో నిలబడి ఉన్న. అంబేడ్కర్ వాది బైరి నరేష్ ను పలకరిద్దామని అటు వెళ్ళబోయా. అంతలో నాకు వేరే ఫ్రెండ్ అడ్డుగా వచ్చాడు. వాడితో మాట్లాడుతూ ఉన్న..అంతలో హోటల్ మెయిన్ డోర్ దగ్గర హడావిడి. ఎవరు వస్తున్నారని చూస్తే బండి సంజయ్ , శ్రవణ్ ఇద్దరు కారులోనుంచి కిందికి దిగి మా పక్క నుంచే లోపలికి వెళ్ళిపోయారు. కొద్ది నిమిషాల తరువాత బైరి నరేష్ ను ఒక వ్యక్తి వచ్చి తీసుకెళ్ళాడు.
నేను నరేష్ ను కలిసి వెళ్ళిపోదామని కాసేపు వెయిట్ చేశాను..నరేష్ ఎంతకు వెయిటింగ్ హల్ కు రాకపోవడంతో వెతుకుంటు లోపలికి వెళ్ళాను. రూం నెంబర్ 104 బయట కమలాపూర్ కు సంబందించిన బీజేపీ లీడర్ కనిపిస్తే మాట్లాడుతూ నిలబడ్డా.కాసేపటికి బైరి నరేష్ బయటకు వచ్చి స్పీడ్ గా వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికే బండి సంజయ్, శ్రవణ్ ఈద్దరు బయటకు వచ్చి కిందికి వెళ్ళారు..కమలాపూర్ బీజేపీ నేతవైపు నేను ఆశ్చర్యంగా ఒక చూపు చూసిన. ఏంది అలా చూస్తున్నావ్ అన్నాడు. పాకిస్తాన్, ఇండియా ఒకే హోటల్ లో మీటింగ్ పెట్టినట్లుగా ఉంది అన్నాను. దానికి అతను సంజయ్ అన్న రాజకీయం అంతే మామూలుగా ఉండదు.
కెసిఆర్ ను మించిన రాజకీయాలు చేయగలడని సమాధానం ఇచ్చాడు.అసలు సంజయ్, నరేష్ ఎందుకు కలిశారని అడిగితే నవ్వుతూ వెళ్ళిపోయాడు .. ఇది జరిగి వారం రోజులు అవుతుంది. ఈ వారం రోజులుగా నేను ఈ విషయం గురించి ఆలోచించలేదు. నిన్న నరేష్ వీడియో బయటకు వచ్చాక ఒక క్లారిటీ వచ్చింది.
నోట్ : ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమాలపుర్ కు సంబందించి రాజేష్ మాదిగ మెసేజ్
Also Read : బైరి నరేష్ అలా మాట్లాడొచ్చా..?