తనపై విధించిన సస్పెన్షన్ బీజేపీ ఎత్తివేయకపోవడంతో పొలిటికల్ జర్నీపై ఎమ్మెల్యే రాజాసింగ్ డైలమాలో పడిపోయారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే బీజేపీ నుంచి మాత్రమే చేస్తానని.. పార్టీ టికెట్ నిరాకరిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. అయినా ఆయనకు పార్టీ నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. దీంతో గోషామహల్ నుంచి ఆయన పోటీపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో రాజాసింగ్ మాట్లాడుతూ ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల తరువాత ఈ సభలో ఎంతమంది ఉంటారో, ఎంతమంది ఉండరో తెలియదని.. తానైతే ఉండనని సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం మీడియా పాయింట్ లో మాట్లాడారు. ” నేను అసెంబ్లీకి రావొద్దని బయటవాళ్ళు, సొంత వాళ్లు కోరుకుంటున్నారు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంటే పార్టీలోనే కొంతమంది రాజాసింగ్ ఎదుగుదలను ఓర్చుకోలేకపోతున్నారని చెప్పకనే చెప్పారు. వాళ్ళు ఎవరనేది పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే , తాను ఉన్నా లేకపోయినా తమ ధూల్ పేట ప్రజలపై కేసీఆర్ ఆశీస్సులు ఉండాలని , అక్కడి ప్రజల కోసం ఏదైనా ఉపాధి కల్పించాలని రాజాసింగ్ కోరడం చర్చనీయాంశం అవుతోంది.
Also Read : కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్న బీజేపీ..!!