తెలుగు సినిమా ఔన్నత్యాన్ని ప్రపంచ స్థాయికి చాటిన దర్శకధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
ఆయన ఏ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయబోతున్నారో తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారా..? ఎన్నికల్లో ఓటర్లను చైతన్యపరిచేందుకు రాజమౌళి ప్రచారం నిర్వహించనున్నారు. అయితే.. రాజమౌళి ఎన్నికల ప్రచారం చేసేది ఏ పార్టీకో.. ప్రభుత్వానికి మద్దతుగానో కాదు. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచాలని ఆయన ఓటర్లను అభ్యర్థించనున్నారు.
కర్ణాటకలోని రాయచూరు జిల్లా ఎన్నికల ప్రచారకర్తగా రాజమౌళిని నియమించినట్లు ఆ జిల్లా చంద్రశేఖర్ నాయక్ ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు రాజమౌళి ద్వారా చైతన్యపరిచాలని… ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు రాజమౌళి పేరు సిఫార్సు చేసినట్లు చెప్పారు.
కర్ణాటక ఎన్నికల కమిషన్ చేసిన ఈ ప్రతిపాదనను రాజమౌళి కూడా ఆమోదించారని వివరించారు. రాయచూరు జిల్లా మాన్వి తాలూకా అమరేశ్వర క్యాంపులో జన్మించిన రాజమౌళి ప్రచారంతో జిల్లాలో పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజమౌళికి రాజకీయాలపై ఆసక్తి వుంది. గతంలో లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ తో కలసి పని చేశారు. అయితే ఇతర రాష్ట్రంలో ప్రచారం చేయడం ఇదే తొలిసారి.